మనీ: వ్యాపారం చేసే వారికి శుభవార్త.. రూ.10 లక్షల - రూ. కోటి వరకు లోన్..!!
షెడ్యూల్డ్ కులాలు , షెడ్యూల్డ్ తెగల వారితోపాటు మహిళలకు కూడా రుణాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్టాండప్ ఇండియా పథకం ఇటీవల ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2016లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఎంతో మంది రుణాలను పొందారు. ఇక ఈ ఏడాది మార్చి 21 వరకు సుమారుగా ఒక 1,33,995 మంది ఈ పథకం నుంచి రుణాలు తీసుకున్నారు అని.. ఏకంగా రూ.30,160 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ పథకం ద్వారా వ్యాపారం చేయాలని ఆలోచించే వారిలో ఎస్సీ, ఎస్టీ కులాల తో పాటు మహిళలకు కూడా రుణాలను అందివ్వడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని పనులు సమకూర్చింది . ఇకపోతే ఈ పథకాల ద్వారా రూ. 10 లక్షల నుండి కోటి రూపాయల వరకు రుణం పొందడానికి అర్హులు అవుతారు.. 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా సరే ఈ పథకం ద్వారా డబ్బులను రుణంగా పొందవచ్చు. ప్రతి బ్యాంకు లో కూడా కనీసం ఒక్కరికైనా ఈ పథకం ద్వారా లోన్ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే తయారీ రంగంz వ్యవసాయ అనుబంధ వ్యాపార , సేవా రంగాలలో పనిచేసే వారు ఈ రుణాలను పొందవచ్చు. బ్యాంకుల ద్వారా గతంలో రుణం తీసుకొని చెల్లించకుండా డిఫాల్ట్ అయిన వారికి ఈ పథకం ద్వారా రుణం లభించదు. ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాండప్ ఇండియా పోర్టల్ అయినటువంటి https://www.standupmitra.in/ ద్వారా రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు.