సాధారణంగా చాలా మంది కరోనా తర్వాత ఉద్యోగాలు చేయడానికి మొగ్గు చూపడం లేదు . ఎందుకంటే ఇంటికే అలవాటుపడిన వీరంతా ఏదైనా వ్యాపారం లేదా బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పటికే ఎవరైతే బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారో అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయం అందజేస్తోంది. భూమి ఉన్న వాళ్ళు ఎక్కువగా సాంప్రదాయ వ్యవసాయం కాకుండా ఆధునిక వ్యవసాయం చేస్తూ కొన్ని లక్షల రూపాయలను లాభం కింద పొందుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి వారిలో చాలా మంది సుగంధద్రవ్యాల పంటలు , పువ్వులు, ఔషధ మొక్కలు వంటివాటిపై సాగు మొదలు పెట్టడం గమనార్హం.
అలాంటి వాటిలో బే ఆకు సాగు కూడా చాలా లాభదాయకమైనది అని చెప్పవచ్చు. ఇప్పటికే చాలామంది ఈ సాగు ద్వారా లక్షల రూపాయలను ఆర్జిస్తున్నారు. తక్కువ ఖర్చు.. తక్కువ శ్రమతో కూడిన ఈ బే ఆకు సాగు భారీ లాభాలను అందిస్తుంది. ప్రస్తుతం ఈ బే ఆకుల సాగుకు ప్రభుత్వం కూడా సబ్సిడీ అందజేస్తోంది కాబట్టి మీరు మొక్కల పెంపకం ఎలా ప్రారంభించాలో తెలుసుకుంటే సరిపోతుంది. అంతే కాదు ఒక్క సారి నాటితే చాలు చాలా సంవత్సరాల పాటు మీకు దిగుబడిని అందించడం విశేషం. ఇక ఈ సాగు లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మానవశక్తి అవసరం లేకుండా యంత్రాల ద్వారానే పని జరిగిపోతుంది.
ఎలా సాగు చేయాలి అనే విషయానికి వస్తే .. మొక్కకు.. మొక్కకు..నాలుగు నుంచి ఆరు మీటర్ల దూరంలో నాణ్యమైన బే ఆకు మొక్కలను నాటాలి. క్రమం తప్పకుండా నీటిని అందివ్వాలి. బే ఆకు మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు మీరు మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది కదా అందులో ఏవైనా కూరగాయలను నాటడం వల్ల అదనపు ఆదాయం కూడా వస్తుంది. ఎవరైతే సాగు చేస్తారో అటువంటి రైతులకు జాతీయ ఔషధ మొక్కల బోర్డు 30 శాతం సబ్సిడీ కూడా అందిస్తుంది. సబ్సిడీ పొందాలి అంటే జాతీయ ఔషధ మొక్కల బోర్డు కి దరఖాస్తు చేసుకోవాలి. ఇక మీరు 25 బే ఆకుల మొక్కలను నాటి నట్లయితే ప్రతి సంవత్సరం రూ.75 వేల నుండి రూ.1. 25 లక్షల వరకు లాభం పొందవచ్చు.