మనీ: రైతులకు శుభవార్త తెలిపిన కేంద్ర ప్రభుత్వం..!!
ఇలా ఉండగా పదవ విడతలో ప్రధాని మోడీ చివరిసారిగా జనవరి 1వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 11వ విడత ఈ నెల 31వ తారీఖున విడుదల చేస్తామని ప్రకటించారు. రైతులు కూడా తమ ఖాతాల్లోకి 11 వ విడత డబ్బులు జమ కావాలి అంటే ముందుగా ఈ కేవైసీ అప్డేట్ చేయించాల్సి ఉంటుంది. ఇక మే 31 లోపు రైతులు తమ ఈ కేవైసీ అప్డేట్ చేయకపోతే తదుపరి విడత నగదు వారి ఖాతాల్లో జమ కాదు అని కూడా స్పష్టం చేశారు. పీఎం కిసాన్ జాబితా 2022 ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే ముందుగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక పోర్టల్ ను మీరు లాగిన్ అవ్వాలి.
ఇక ఆ తర్వాత ఫార్మర్స్ కార్నర్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు లబ్ధిదారుల జాబితా లింక్ పై క్లిక్ చేసి రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామ సమాచారాన్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చివరిగా గెట్ రిపోర్టర్ పై క్లిక్ చేస్తే ఒక జాబితా స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం మీ సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ ను సందర్శించి అన్ని వివరాలను దరఖాస్తు ఫారం పూర్తి చేయాలి.