మనీ: రూ.10 వేల పెట్టుబడితో రూ.6 కోట్లకు పైగా లాభం..!

Divya
అదృష్టం బాగుంటే సామాన్యులు కూడా కోటీశ్వరులు అవుతారు అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పవచ్చు. చాలామంది స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే రిస్క్ తో కూడుకున్న పని కాబట్టి ఒక్కొక్కసారి పెట్టిన డబ్బులకు పెట్టుబడి కూడా రాని పరిస్థితులు ఏర్పడతాయి.అందుకే చాలామంది స్టాక్ మార్కెట్లో డబ్బులను ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతూ ఉంటారు. కానీ ఇటీవల జ్యోతి రెసిన్స్, అదెసివ్ లిమిటెడ్.. కంపెనీకి చెందిన స్టాక్స్ షేర్ మార్కెట్లో అద్భుతంగా ర్యాలీ చేస్తున్నాయి. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తూ రోజురోజుకు వృద్ధి సాధిస్తున్నాయి.
ఇకపోతే గతంలో జ్యోతి రెసిన్స్, అదెసివ్ లిమిటెడ్.. కంపెనీలు ఒకప్పుడు స్టాకు ధర కేవలం 36 పైసలుగా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అది ఏకంగా రూ.2,300 దాటిపోయింది. ఇకపోతే ఊహించని లాభాలతో ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారంతా ప్రస్తుతం కోటీశ్వరులు అయ్యారు. వేలల్లో పెట్టినవారు కోటీశ్వరులుగా మారడం చాలా సంచలనం అనే చెప్పాలి. ఇక అసలు విషయంలోకి వెళితే 2004వ సంవత్సరంలో..జ్యోతి రెసిన్స్, అదెసివ్ లిమిటెడ్.. ఒక్కొక్క షేర్ ధర కేవలం 36 పైసలుగా మాత్రమే ఉండేది. ఇక ఈ స్టాక్ లో చాలామంది పెట్టుబడి కూడా పెట్టారు

ఇకపోతే ఏళ్లు గడుస్తున్నా పెద్దగా వృద్ధి సాధించలేదు. కానీ అతి కష్టం మీద 2014లో దీని విలువ రూ.7.83 కి చేరుకుంది. ఇక ఏప్రిల్ 2015 లో జ్యోతి రెసిన్స్, అదెసివ్ లిమిటెడ్.. స్టాకు ధర అనూహ్యంగా రూ.13 కి చేరుకుంది మరి ఈ ఏడాది కాలం వ్యవధిలోని వంద రెట్ల శాతం పైకి ఎగబాకి. రూ.103 కి చేరుకోగా మే 2020 లో ఈ షేర్ ధర రూ.111.80 కి చేరుకుంది . ఇక 2021 వ సంవత్సరం వచ్చేసరికి ఈ షేర్ ధర రూ.697.25 కి చేరుకోగా అదే ఏడాది మేలో రూ.700 రేంజిలో దూసుకుపోయింది ఇక ప్రస్తుతం ఏకంగా దీని విలువ రూ.2313 కి చేరుకోవడంతో ఇన్వెస్టర్లు కు కళ్ళు చెదిరే లాభాలు లభిస్తున్నాయి. మీరు 2004లో ఈ కంపెనీలో లక్ష రూపాయలు కనుక పెట్టుబడి పెట్టి ఉంటే దాని విలువ ప్రస్తుతం రూ.65 కోట్లకు చేరి ఉండేది. కనీసం రూ.10,000 పెట్టినా సరే రూ.6.30 కోటి వచ్చేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: