మనీ: రూ.200 ఆదాతో రూ.28 లక్షలు మీ సొంతం..!!
ఈ పాలసీలో మీరు ప్రతి రోజు 200 రూపాయల చొప్పున ఆధా చేస్తూ 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసినట్లయితే 28 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. అదనంగా 15000 రూపాయల పెన్షన్ కూడా అందించబడుతుంది. పెట్టుబడి పెట్టిన మొదటి ఐదు సంవత్సరాల వరకు రిస్కు కవర్ ఉంటుంది ఇక ఆరు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వరకు బీమా రిస్కు కవర్ 25 నుండి 125 శాతానికి పెరుగుతుంది ఇక 15 సంవత్సరాల వరకు రిస్కు కవర్ 150 శాతానికి పెరుగుతుంది అని చెప్పవచ్చు. 20 సంవత్సరాలు చెల్లించి మధ్యలో డబ్బులు విత్డ్రా చేసుకోకుంటే మీకు 200 శాతం రిస్క్ కవర్ లభిస్తుంది.
మీరు రెండు లక్షలకు పాలసీ తీసుకుంటే మొదటి ఐదు సంవత్సరాల పాటు బీమా కవరేజ్ , 6-10 సంవత్సరాల మధ్య రూ.2.5 లక్షలు..11-15 సంవత్సరాల మధ్య రూ.3 లక్షలు, 16-20 సంవత్సరాల మధ్య బీమా సుమారుగా రూ.4 లక్షల వరకు ఉంటుంది. పాలసీదారుడు మరణించిన లేదా వైకల్యం పొందిన తప్పనిసరిగా బీమా కవరేజ్ అందుతుంది. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే నామినీకి కనీస హామీ మొత్తం చెల్లించబడుతుంది.