మనీ: రిటైర్మెంట్ తర్వాత డబ్బు రావాలంటే ఇలా చేయండి..!!

Divya
ఎవరైనా సరే రిటైర్మెంట్ తర్వాత డబ్బు కోసం ఇబ్బంది పడకుండా ముందు నుంచి జాగ్రత్త పడతారు. ఇక ఈ క్రమంలోనే ప్రతినెల కచ్చితంగా పెన్షన్ వస్తే బాగుంటుందని ఆలోచించేవారు కూడా ఉన్నారు. అందుకే అలాంటి వారి కోసం ఎల్ఐసి ఒక అద్భుతమైన పాలసీని తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రధానమంత్రి వయో యోజన పేరుతో ఈ పథకం నిర్వహణ బాధ్యతలను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చూస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ పథకం పై ప్రస్తుతం 7.4% వడ్డీ లభిస్తున్న నేపథ్యంలో మంచి ఆదాయం కూడా ఉంటుంది.
ఇక ఈ పథకంలో భాగంగా గరిష్టంగా 15 లక్షల వరకు మీరు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ పథకం యొక్క మెచ్యూరిటీ సమయం పది సంవత్సరాలు. రూ. 15 లక్షల పెట్టుబడి పెడితే నెలకు మీకు రూ.9,250 గ్యారంటీగా పెన్షన్ లభిస్తుంది. ప్రస్తుతం ఈ పథకం వచ్చే యేడాది మార్చి 31 వరకు అందుబాటులో ఉండనుంది. అంతేకాదు 7.4% ఉన్న వడ్డీ అప్పటికి మారే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ పథకంలో చేరడానికి ఎటువంటి వయస్సు , అర్హత అవసరం లేదు.. పుట్టిన నెల రోజుల నుంచి ఎప్పుడైనా ఈ పథకంలో చేరవచ్చు. ఇకపోతే ఈ పథకంలో చేరిన తర్వాత నిర్ణీత కాలం ముగిసినప్పుడు పెన్షన్ నెల, మూడు నెలలు, ఆరు నెలలు లేదా సంవత్సరం చొప్పున పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.
అంతేకాదు మీరు ఎంచుకున్న పెన్షన్ బట్టి వడ్డీ రేటు కూడా మారుతుంది . ఒక నెలవారి పెన్షన్ కావాలనుకుంటే 7.4% , మూడు నెలలకు ఒకసారి కావాలనుకుంటే 7.45% , ఆరు నెలలకు ఒకసారి కావాలి అంటే 7.52%,  ఏడాదికి ఒకసారి కావాలి అనుకుంటే 7.66% వడ్డీ లభిస్తుంది. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే అప్పటివరకు పెట్టుబడిగా పెట్టిన డబ్బులను నామినీకి అందిస్తారు. ఏది ఏమైనా ఈ పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల రిటైర్మెంట్ అయిన తర్వాత డబ్బులకు ఇబ్బంది ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: