మనీ : రూ.29 పెట్టుబడి తో రూ.4 లక్షల బెనిఫిట్..!

Divya
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశంలోనే తన కస్టమర్ల కోసం ప్రతిసారి అద్భుతమైన ప్లాన్లను అందిస్తూనే వారిని ఆర్థికంగా ఆదుకుంటుంది. ముఖ్యంగా మహిళలను స్వావలంబనగా తీర్చిదిద్దేందుకు.. ఎల్ఐసి ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇక ఈ పథకం పేరు ఎల్ఐసి ఆధార్ శిలా ప్లాన్. ఈ పథకం కింద 8 నుండి 55 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు పెట్టుబడిగా పెట్టవచ్చు. ముఖ్యంగా ఈ ప్లాన్ తన కస్టమర్లకు భద్రత, పొదుపు రెండింటిని అందిస్తుంది. ఇక ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే మహిళలకు ఆధార్ కార్డు తప్పనిసరి. ఇక ఈ ప్లాన్ యొక్క పాలసీదారుడు మరణిస్తే అతని మరణం తర్వాత కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తుంది ఎల్ఐసి.

LIC.. ఆధార్ శిలా ప్లాన్ రూ.75,000 , గరిష్టంగా రూ.3లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇకపోతే ఈ పాలసీ మెచ్యూరిటీ వ్యవధి కనిష్టంగా 10 సంవత్సరాలు. ఇక గరిష్టంగా 20 సంవత్సరాలు. 8 నుండి 55 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలు ఎల్ఐసి ప్లాన్లో పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా మెచ్యూరిటీ వయసు 70 సంవత్సరాలు. ఇదే సమయంలో ఈ ప్లాన్ ప్రీమియం చెల్లింపు నెలవారి , త్రైమాసికం, అర్థ సంవత్సరం లేదా వార్షిక ప్రాతిపదికన ఎంచుకోవచ్చు. ఉదాహరణకు 30 సంవత్సరాల వయసు ఉండి 20 సంవత్సరాల పాటు రోజూ రూ.29 డిపాజిట్ చేస్తే మొదటి సంవత్సరంలో మీరు రూ.10,959 డిపాజిట్ చేస్తారు. ఇక ఇప్పుడు అందులో 4.5 % వడ్డీ కూడా ఉంటుంది.

ఇక మీరు 20 సంవత్సరాల లో రూ.2,14,696 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక మెచ్యూరిటీ సమయంలో మీరు మొత్తం రూ.3,90,000 పొందుతారు. ఇక మీరు మరిన్ని వివరాల కోసం మీకు దగ్గరలో ఉన్న ఎల్ఐసి సిబ్బందిని సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు. మహిళలకు మరింత ఆర్థిక భరోసా ఇవ్వచ్చు అని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఇలాంటి పథకాలు ఆడవారికి మరింత ఆదాయాన్ని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: