మనీ: ప్రతినెలా పెన్షన్ పొందాలి అంటే.. ఇలా చేయండి..!
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పాపులర్ పెన్షన్ పథకాలలో నేషనల్ పెన్షన్ సిస్టం కూడా ఒకటి. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రతినెల డబ్బులు పెన్షన్ రూపంలో పొందవచ్చు. ఈ స్కీం లో దీర్ఘకాలం పొదుపు చేయడం వల్ల రిటైర్మెంట్ నాటికి సంపాదన కూడా కూడబెట్టుకోవచ్చు. ఈ స్కీమ్ లో పొదుపు చేయడం వల్ల నెలకు రూ.50 వేలకు పైగా పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఇకపోతే రిటైర్మెంట్ వరకు పొదుపు చేసిన మొత్తంలో కొంత భాగాన్ని పెన్షన్ కోసం కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నియమ నిబంధనల ప్రకారం నేషనల్ పెన్షన్ సిస్టం కార్పస్ నుంచి మెచ్యూరిటీ సమయంలో మొత్తం విత్డ్రా చేసుకుని అవకాశం ఉండదు కాబట్టి కార్పస్ లో 40%తో యానిటీ కొనాలి ఇక దీని నుంచే రిటర్మెంట్ తర్వాత మీరు పెన్షన్ పొందుతారు.
ఇక మీరు ఎంత పెన్షన్ పొందాలని అనుకుంటున్నారో మీరు పెట్టుబడి పెట్టే దాని పైన ఆధారపడి ఉంటుంది.ఉదాహరణకు మీరు కోటి రూపాయలతో యాన్యుటీ కొంటేనే ఏడాదికి రూ.ఆరు లక్షలు లేదా నెలకు రూ.50 వేల పెన్షన్ లభిస్తుంది.అంతకంటే తక్కువ పెన్షన్ పొందాలి అనుకుంటే మీరు తక్కువగా ఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది .కానీ దీర్ఘకాలం పొదుపు చేస్తేనే మంచి రిటర్న్స్ కూడా వస్తాయని గుర్తుంచుకోవాలి.