మనీ: రూ.5వేల పొదుపుతో రూ.3.5 లక్షలు..ఆదాయం ఎలా అంటే...?

Divya
ఈ మధ్యకాలంలో చాలామంది భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుంచే డబ్బు ఆధా చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ క్రమంలోని ఎన్నో బ్యాంకులు , పోస్ట్ ఆఫీస్ లు కూడా డబ్బు ఆదా చేయడానికి బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నాయి. వీటిలో రికరింగ్ డిపాజిట్ల గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఈక్విడిటీ ఆప్షన్ ను అందించే ఆర్డి అకౌంట్లు ఓపెన్ చేయడం కూడా చాలా సులువు. ఇక బ్యాంకు యాప్ ద్వారా కూడా వీటిని ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో రికరింగ్ డిపాజిట్ ఖాతా ను ఉపసంహరించుకొని మొత్తం నగదును వెనక్కు తీసుకునే వెసులుబాటును కూడా కల్పించబడింది. ఇక అంతేకాదు ఇన్ని ఆప్షన్లతో కూడి.. సేవింగ్స్ చేసుకునే అవకాశాలున్న ఆర్డి ఖాతాలపై కొన్ని బ్యాంకులు 7 శాతానికి పైగా వడ్డీ రేట్లు కూడా ఆఫర్ చేస్తూ ఉండడం గమనార్హం.

ఇకపోతే ద్రవ్యోల్భనాన్ని కట్టడి చేసేందుకు ఆర్బిఐ ఇటీవల మూడుసార్లు కీలక రెపో రేటును పెంచడం జరిగింది. ఇక దీంతో బ్యాంకులు కూడా ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లు కూడా పెంచాయి.. ఇక ఇలా వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులలో మైక్రో ఫైనాన్స్ బ్యాంకులు ముందంజలో ఉన్నాయని చెప్పవచ్చు.  ఇక బ్యాంకు బజార్ రిపోర్టు ప్రకారం ఐదు సంవత్సరాల కాలవ్యవధి ఆర్డీలపై అత్యధిక వడ్డీ రేట్లు అందిస్తున్న బ్యాంకుల విషయానికి వస్తే..IDFC ఫస్ట్ బ్యాంక్.. ఇందులో ఐదు సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ లపై 6.5% వడ్డీ లభిస్తోంది.  ప్రతి నెల రూ.5000 చొప్పున ఐదు సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే కాల పరిమితి ముగిసేసరికి మీ చేతికి రూ.3.55 లక్షలు లభిస్తాయి.

ఆర్బిఎల్ బ్యాంకులో ఐదు సంవత్సరాల కాల పరిమితిలో రికరింగ్ డిపాజిట్ ల పై 6.5% వడ్డీ లభిస్తోంది. ఇక అలాగే ఇండస్ బ్యాంక్ , ఎస్ బ్యాంక్ అత్యుత్తమ వడ్డీ రేట్లు అందించే ప్రైవేటు బ్యాంకులో ఇవి కూడా ముందు వరుసలో ఉన్నాయి. ఇక వీటిలో ఐదు సంవత్సరాల కాలవ్యవధి ఆర్డీలపై 6.75% వడ్డీని అందిస్తున్నాయి. ఇక సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు కూడా 6.75% వడ్డీని అందిస్తోంది.. ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 7 శాతం వడ్డీని, డాయిస్ బ్యాంకు 7 శాతం , ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 7.2% వడ్డీని అందిస్తున్నాయి. ముఖ్యంగా రికరింగ్ డిపాజిట్ చేసేటప్పుడు ఏ బ్యాంకులో అధిక వడ్డీ లభిస్తుందో పరిశీలించిన తర్వాత వాటిలో ఇన్వెస్ట్ చేయడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: