మనీ: ఫిక్స్డ్ డిపాజిట్ పై వడ్డీ రేట్లు పెంపు..!

Divya
ద్రవ్యోల్భనాన్ని అరికట్టడానికి ప్రస్తుతం గత ఐదు నెలల క్రితం bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 190 బేసిస్ పాయింట్లుగా పెంచింది. దాంతో రెపోరేటు ఇప్పుడు 5.9 శాతానికి చేరుకుంది. ఇక ఈ రేటు పెరగడం వల్ల రుణ గ్రహీతలపై భారం కూడా పెరగనుంది. కానీ బ్యాంకు సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ , రికరింగ్ డిపాజిట్లు ఉన్నవారికి లాభం చేకూరబోతోంది. ఎందుకంటే ఈ రేటు పెరగగానే ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులో టర్మ్ డిపాజిట్లు పై వడ్డీ రేట్లు పెంచుతాయి. తద్వారా బ్యాంకులలో పెట్టబడిదారులకు అధిక వడ్డీ లభిస్తుంది. ముఖ్యంగా ఆర్బిఐ రెపోరేట్ ను పెంచడంతో ఆయా బ్యాంకులో కూడా ఫిక్స్ డిపాజిట్ లపై ఏడు శాతం కంటే ఎక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్నాయి..
ప్రస్తుతం స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయినటువంటి ఎన్నో బ్యాంకులు 7% కంటే ఎక్కువ ఫిక్స్ డిపాజిట్ రేట్ లపై వడ్డీని అందిస్తున్నాయి.. వాటిలో ముఖ్యంగా ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు,  ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు,  ఫిక్స్ డిపాజిట్ లపై 7.5% వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఇక ఈ వడ్డీ రేట్లు మీరు పొందాలి అనుకుంటే ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో వెయ్యి రోజులు ఫిక్స్ డిపాజిట్ ఉంటే ఈ వడ్డీ రేట్లు లభిస్తాయి. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో పెట్టుబడి కాల పరిమితి 525 రోజులు, 990 రోజులు ఉండాలి. ఇక సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ 999 రోజులు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 7.4 9% వడ్డీని అందిస్తున్నాయి.
ఇక జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు మూడేళ్ల కంటే ఎక్కువ కాల పరిమితి కలిగిన ఫిక్స్ డిపాజిట్ లపై 7.35% అందిస్తుంది. ఇక ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూర్ అవ్వాల్సి ఉంటుంది. వీటితోపాటు మరెన్నో స్మాల్ సేవింగ్స్ బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ ల పై వడ్డీ రేటు 7 శాతం కంటే ఎక్కువ అందిస్తూ ఉండడం హర్షదాయకం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: