మనీ: మట్టి లేకుండా వ్యవసాయం.. రూ. లక్షలు సంపాదిస్తున్న జర్నలిస్ట్..!

Divya
ఇండియాలో గతంలో వ్యవసాయ ఆధారంగా ఎంతోమంది జీవనం సాగించేవారు. అయితే మారుతున్న కాలం కొద్ది ప్రజలు కూడా వ్యవసాయాన్ని విడిచి పలు ఉద్యోగాల బాట పడుతూ ఉన్నారు. దీంతో వ్యవసాయం అంటే చాలా భారంగా మారిపోయింది. అయితే మిగిలిన ప్రజలు చేస్తున్నా.. వారికి ఏళ్లు గడిచినా కూడా వ్యవసాయానికి సహాయం లేక పలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొంతమంది భూములు అమ్ముకోగా మరికొంతమంది పెట్టుబడులు భరించలేక వదిలేస్తూ ఉన్నారు. అయితే తాజాగా కొంతమంది రసాయనాల ద్వారా కూడా పంటలు పండిస్తూ ఉన్నారు. ఇది పలుచోట్ల చాలా నిరూపించబడడం కూడా అయింది.

అయితే ఇప్పుడు తాజాగా ఎటువంటి రసాయనాలు కలపకుండా సేంద్రియ పద్ధతిలోని సహజంగా పండించిన కూరగాయలు మార్కెట్లోకి విపరీతమైన డిమాండ్ ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా ఒక వ్యక్తి మట్టి లేకుండానే వ్యవసాయం ద్వారా కూరగాయలను పండించి రూ. 70 లక్షల రూపాయలు సంపాదిస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన రామ్ వీర్ సింగ్ అనే రైతు అతని ఇంటి మీద పంట వేయడమే కాకుండా ఆ పంటను అమ్మి లాభాల బాట పట్టించి అక్కడున్న ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలిచారు.
రామ్ గతంలో జర్నలిస్టుగా పనిచేసేవారు.  ఈయన తనకున్న వనరులతో వ్యవసాయం చేయాలనుకున్నారు.  అందుచేతనే వింత ఆర్గానిక్ అండ్ హైడ్రోఫోనిక్స్ అనే స్టార్టప్ ను ప్రారంభించారు. దీనికి అనుగుణంగా తన ఇంటిలో ఉన్న మూడు అంతస్తులు వ్యవసాయ క్షేత్రంగా మార్చారు.  ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పద్ధతిలో సాగుకు మట్టి అవసరం లేదట. అంతేకాకుండా 90% వరకు నీటిని కూడా ఆదా చేసుకోవచ్చు. ఇందులో కేవలం రసాయనాలు కూడా వాడాల్సిన పనిలేదని తెలియజేశారు. పీవీసి పైపుల సహాయంతో అతని బాల్కనీలో పంటలను పండిస్తూ ఉన్నారు. అందులో స్ట్రాబెరీ, కాలీఫ్లవర్, బెండకాయ వంటి పదివేల రకాల మొక్కలను తన ఇంటి మీద లేయర్స్ గా వేసి పండిస్తున్నారు ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: