మనీ: రూ.1515 పెట్టుబడితో రూ.30 లక్షలకు పైగా ఆదాయం..!
ఈ క్రమంలోనే పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన పథకాలలో గ్రామ సురక్ష పథకం కూడా ఒకటి. ఇందులో నెలకు రూ.1500 పెట్టుబడిగా పెట్టి క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం వల్ల ఈ పథకం మెచ్యూరిటీ తర్వాత రూ.30 లక్షలకు పైగా ఆదాయం లభిస్తుంది. అయితే ఇందులో చేరడానికి కనీస వయసు 19 సంవత్సరాలు ఉండాలి. గరిష్టంగా 55 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా భారతీయ పౌరులు ఎవరైనా సరే ఈ పథకంలో అర్హత ఉంటే చేరవచ్చు. ఒక వయసు అర్హత తప్ప ఇందులో చేరడానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవని చెప్పాలి. ఇకపోతే ఈ పథకంలో రూ.30 లక్షలకు పైగా ఆదాయం పొందాలి అంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఒక వ్యక్తి 19 సంవత్సరాల వయసులో నెలకు రూ.1515 పెట్టుబడితో 55 సంవత్సరాల వయసు వచ్చేవరకు పెట్టుబడి పెట్టాలి అప్పుడు మొత్తంగా మీకు రూ.31.60 లక్షలు మీ చేతికి వస్తాయి . ఇంతకంటే మంచి ఆదాయం మరెక్కడ ఉండదు. వృద్ధాప్యంలో ఇంత అమౌంట్ వస్తే మీరు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఒకరిపై ఆధారపడకుండా సుఖంగా జీవించవచ్చు. ప్రస్తుతం ఈ డబ్బు కేవలం మీరు ఒక్కరోజు బయటకు వెళ్లలేదంటే సరిపోతుంది. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండదు.