మనీ: రూ.20 ఆదాతో కోటి రూపాయలు..!
అయితే ఎల్ఐసి న్యూ టెక్ టర్మ్ ప్లాన్ 18 నుంచి 65 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు ఎవరైనా తీసుకోవచ్చు. 80 సంవత్సరాల లోపు మెచ్యూరిటీ వయసు ఉంటుంది. కనీస అశ్యూర్డ్ రూ. 50 లక్షలు కాగా గరిష్ట పరిమితి ఏమీ లేదు. ఈ పాలసీ టర్మ్ 10 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఎల్ఐసి న్యూ జీవన్ అమర్ ప్లాన్ లో ఉన్నట్టుగానే రెగ్యులర్ ప్రీమియం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్స్ ఉంటాయి. రెగ్యులర్ ప్రీమియంలో పాలసీ టర్మ్ మొత్తం ప్రీమియం చెల్లించాలి. లిమిటెడ్ ప్రీమియంలో పాలసీ టర్మ్ కన్నా 10 సంవత్సరాల ముందు వరకు ప్రీమియం చెల్లించవచ్చు.
ఉదాహరణకు 20 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి ఆప్షన్ వన్ ఎంచుకొని 20 ఏళ్ల పాలసీ టర్మ్ తో కోటి రూపాయల పాలసీ తీసుకున్నట్లయితే రెగ్యులర్ ప్రీమియం అయితే ఏడాదికి రూ.7,047 అలాగే జీఎస్టీ కూడా చెల్లించాలి అంటే రోజుకు రూ.20 లోపే.. ఆ వ్యక్తి 20 ఏళ్లపాటు రోజుకు 20 రూపాయల చొప్పున ఆధార్ చేస్తే ఈ పాలసీ టర్మ్ కింద కోటి రూపాయల కవరేజీ లభిస్తుంది.