మనీ: రైతులకు శుభవార్త తెలిపిన కేంద్ర ప్రభుత్వం..!
వాస్తవానికి ద్రవ్యోల్బణం కొత్త రికార్డుల మధ్య ప్రజలు ఈ బడ్జెట్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి పెద్ద ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. మీరు కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులైతే మీ ఆదాయం కూడా రెట్టింపు అవ్వబోతోంది . రాబోయే బడ్జెట్ 2023లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో ఏటా వచ్చే రూ.6000 మొత్తాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది . నిజానికి ఈ పథకం కింద చాలా రెట్లు పెంచాలని డిమాండ్ ఉంది. కానీ సాధారణ బడ్జెట్ 2022లో కూడా కిసాన్ యోజన వాయిదా మొత్తాన్ని పెంచాలని డిమాండ్ పూర్తి స్వింగ్ లో ఉంది . అందుకే ఈసారి ఈ పథకం మొత్తాన్ని పెంచే అవకాశం ఉందని రైతుల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రూ. 6000 నుంచి రూ.8000 వరకు ఈ మొత్తాన్ని పెంచి రైతులకు ఏడాదికి నాలుగు విడతలలో 2000 రూపాయల చొప్పున ఇవ్వవచ్చు అని చర్చ కూడా జరుగుతుంది ఇదే నిజమైతే రైతులకు మంచి శుభవార్త అని చెప్పవచ్చు. కనీసం రెండు వేల రూపాయలు అయినా కూలీలకు వస్తుందని ఆలోచనలో రైతులు ఉన్నారని సమాచారం.