మనీ: ప్రతినెలా రూ.6వేల పెన్షన్ పొందాలి అంటే..ఈ స్కీంలో చేరాల్సిందే..!!

Divya
ఇటీవల కాలంలో చాలామంది భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెడుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు నూతన సంవత్సరానికి కొత్త నిర్ణయంతో స్వాగతం పలకాలి అని అనుకుంటున్నట్లయితే డబ్బు దాచుకోవడమే మంచి నిర్ణయం అని చెప్పవచ్చు. ఇందులో రిటైర్మెంట్ ప్లాన్ అనేది చాలా ముఖ్యమైనది.. ప్రతినెలా కచ్చితంగా పెన్షన్ పొందాలి అని ఆలోచించేవారు.. ఈ ఎంపిక చేసుకుంటే మంచిది. రిస్క్ లేకుండా రాబడి పొందడం ఈ స్కీం యొక్క ముఖ్య ప్రత్యేకత.
ప్రధానమంత్రి వయో వందన యోజన పథకంలో చేరితే ఖచ్చితమైన పెన్షన్ వస్తుంది. పైగా మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు ఎటువంటి రిస్కు ఉండదు. దేశీ దిగ్గజ భీమా రంగ కంపెనీ ఆయన ఎల్ఐసి అలియాస్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ పథకం యొక్క నిర్వహణ బాధ్యతలు చూసుకుంటోంది. ఈ కొత్త సంవత్సరంలో మీరు కూడా ప్రభుత్వ పథకంలో దరఖాస్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ పథకం కింద మీరు సంవత్సరానికి రూ. 72,000 పొందుతారు. భవిష్యత్తు ఆర్థికంగా సురక్షితంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.  అయితే ఇందులో 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు పెట్టుబడి పై అనేక ప్రయోజనాలను పొందుతారు.
ప్రధానమంత్రి వయో వందన యోజన పథకం ద్వారా నెలవారి పెన్షన్ కింద లబ్ధిదారుడు తన పెట్టుబడిపై 10 సంవత్సరాల పాటు సంవత్సరానికి 7.40 శాతం వడ్డీని కూడా పొందుతాడు. ఒకేసారి ఇందులో తొమ్మిది లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టినట్లయితే ప్రతి ఆరు నెలలకు 36 వేల రూపాయలు అందిస్తారు.  అదే సమయంలో ఈ పథకంలో నెలవారి పెన్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది.  మీకు ఎల్ఐసి ద్వారా ప్రతినెల 6000 రూపాయల పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అంటే ఈ పథకాలలో డబ్బులు ఇన్వెష్ట్ చేయడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: