మనీ: పిల్లల బంగారు భవిష్యత్తుకు వీటిలో ఇన్వెస్ట్ చేయండి..!
ఈ క్రమంలోనే పిల్లల చదువు పూర్తయ్య సమయానికి వివిధ రకాల ఖర్చులు కూడా పెరుగుతాయి, ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజులు, రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఒకవేళ పిల్లలు ఇంటికి దూరంగా మరొకరు నగరంలో చదువుకోవాల్సి వస్తే అప్పుడు హాస్టల్ కి అయ్యే ఖర్చులు కూడా మరింత అదనంగా ఇవన్నీ కలిపితే ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఇకపోతే పిల్లలకు నాణ్యమైన ఉన్నత విద్య అందించడం అనేది తల్లిదండ్రుల ముఖ్య బాధ్యత. కాబట్టి దీనికోసం పిల్లలుగా ఉన్నప్పటి నుంచే డబ్బు ఆదా చేయడం మంచిది.
ఈ క్రమంలోనే రాబడులకు మంచి స్కోప్ ఉన్న ఈక్విటీ డేట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇన్వెస్ట్ కోసం పది సంవత్సరాల కంటే ఎక్కువ సమయం ఉంటే అలాంటి కాల పరిమితిలో మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా 14% వార్షిక రాబడి వస్తున్నాయి. అందుకే ఐదు సంవత్సరాలు కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు డేట్ మ్యూచువల్ ఫండ్స్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి డబ్బు చేతికి వస్తుంది పైగా పిల్లల భవిష్యత్తు బంగారు మయం అవుతుంది.