మనీ: ఏడాదికి రూ.20 ఆదాతో రూ.2 లక్షలకు పైగా ఆదాయం..!
ఈ క్రమంలోని మీకోసం ఒక అద్భుతమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కేవలం ఏడాదికి 20 రూపాయలు మీరు ఆదా చేశారంటే చాలు రెండు లక్షల రూపాయల జీవిత బీమా లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి యోజన పథకం కింద డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఆర్థికంగా భరోసాని అందిస్తుంది. ఈ స్కీంలో చేరడం వల్ల 20 రూపాయల ఆదాతో రూ.2 లక్షల వరకు ప్రీమియం పొందవచ్చు. మీరు ప్రధానమంత్రి సురక్ష యోజన పథకంలో చేరడానికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు సమీపంలో ఉన్న బ్యాంకుకు వెళ్లి ఈ పథకానికి అప్లై చేయవచ్చు లేదా ఇన్సూరెన్స్ ఏజెంట్లతో కూడా మీరు సంప్రదించి ఈ పథకంలో చేరవచ్చు.
మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కు ఈ పథకం లింక్ అయి ఉంటుంది కాబట్టి మీరు ప్రతి సంవత్సరం కట్టాల్సిన అవసరం లేకుండా ఆ సమయం వచ్చేసరికి నేరుగా మీ ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతాయి. ప్రతి సంవత్సరం మే 31వ తేదీన మీ ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతాయి. కాబట్టి ఆ సమయానికి మీరు అకౌంట్లో డబ్బులు ఉంచుకుంటే సరిపోతుంది. 18 నుండి 70 సంవత్సరాల లోపు ఉన్నవారు ఎవరైనా చేరవచ్చు.వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే 2 లక్షల రూపాయలు, శాశ్వత అంగవైకల్యం కలిగితే లక్ష రూపాయలు లభిస్తాయి.