మనీ: రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!

Divya
తాజాగా కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుమ్ యోజన కాలవ్యవధిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 2026 వరకు పొడిగించిందని సమాచారం. ఈ పథకం 2019లో కేంద్ర ప్రభుత్వం చేత ప్రారంభించబడింది.. 2022 నాటికి 30,800 మెగావాట్ల అదనపు సౌర సామర్థ్యాన్ని కలిగి ఉండాలనేదే లక్ష్యంగా పునరుత్పాదక ఇందన శాఖ మంత్రి ఆర్కే సింగ్ కరోనా మహమ్మారి సందర్భంగా PM - KUSUM అమలు వేగం వేగంగా పెరిగిందని లోకసభలో గురువారం వెల్లడించారు. ముఖ్యంగా దేశంలోని 39 జల విద్యుత్ ప్రాజెక్టులలో 9 ప్రాజెక్టుల పనులు అలాగే నిలిచిపోయాయని.. మరో ప్రశ్నకు కూడా ఆయన సమాధానం తెలిపారు. నిజానికి మిగిలిపోయిన నిలిచిపోయిన ప్రాజెక్ట్లను పునః ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఇకపోతే పీఎం కుసుమ్ యోజన పథకం నుండి ఎలా సంపాదించాలి?  సోలార్ పంపు సిస్టంలను ఎలా ఏర్పాటు చేయాలి?  అనే విషయాలపై కూడా క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా సోలార్ పంపు సిస్టంలను పొలాలలో ఏర్పాటు చేస్తే తమ పంట పొలాలకు ఉచితంగా నీరు అందించవచ్చు. సోలార్ సిస్టం అమర్చడం వల్ల విద్యుత్ బిల్లు కూడా గణనీయంగా తగ్గుతుంది.  కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం ఉండదు. నీటిపారుదల పంపులకు ఎటువంటి ఆటంకం కలగదు. ముఖ్యంగా కరెంటు కోత వల్ల రైతుల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.  కాబట్టి పీఎం కుసుమ్ యోజన ద్వారా సోలార్ పంపు సిస్టం నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసి రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.
ఇకపోతే మీరు మీ వినియోగానికి అదనంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తే మీరు దానిని విద్యుత్ పంపిణీ కార్పొరేషన్ కు విక్రయించడం వల్ల కూడా డబ్బు సంపాదించవచ్చు. రెండు రకాలుగా మీకు ఈ పథకం అందుబాటులోకి వస్తుంది మీకు ఖాళీగా ఉన్న భూమి ఉంటే మీరు దానిని ప్రభుత్వానికి అద్దెకు ఇచ్చి తద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇందులో మీరు దరఖాస్తు చేసుకుంటే ఇప్పటినుంచి డబ్బు పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: