మనీ: భార్యాభర్తలకు నెలకు రూ.10 వేలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం..!
అటల్ పెన్షన్ యోజన పథకం విషయానికి వస్తే.. పదవీ విరమణ తర్వాత జీవితం ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వచ్ఛందంగా బ్రతకడానికి ఈ పథకం ప్రోత్సహిస్తుంది. 18 ఏళ్ల నుంచి 40 యేళ్ళ మధ్య వయసు గల భారతీయ పౌరులు ఎవరైనా సరే ఈ పథకం కింద తమ పేరును నమోదు చేసుకునే అర్హత ఉంటుంది. 60 సంవత్సరాలు వయసు నిండిన నాటి నుంచి ఈ స్కీం కింద నెలకు రూ. 1000 నుంచి రూ.5000 కనీసం పింఛన్ కి హామీ ఇస్తుంది..
పై మూడు పథకాలలో ఎక్కువగా అటల్ పెన్షన్ యోజన పథకం.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో బాగా పాపులర్ పొందిన పథకం ఇందులో 22 సంవత్సరంలో మొత్తం 64 లక్షల మంది ఈ పథకంలో చేరారు. ఇప్పటికే ఈ పథకంలో చేరిన వారి సంఖ్య నాలుగు కోట్లుగా నమోదు కావడం జరిగింది. ముఖ్యంగా ఇందులో భార్యాభర్తలు ఇద్దరూ కూడా జాయిన్ అవ్వచ్చు ఇద్దరికీ 60 ఏళ్ల వయసు నుంచి నెలకు రూ. 5000 చొప్పున పెన్షన్ లభిస్తుంది. కాబట్టి ఇద్దరు భార్య భర్తలు ఈ పథకంలో చేరితే నెలకు 10 వేల రూపాయలను ఈ పథకం ద్వారా పొందవచ్చు.