తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ అందిస్తున్న ఎల్ఐసి సరికొత్త పాలసీ..
నిమిషానికి మూడు ఎల్ఐసి జీవన్ ఆజాద్ పాలసీలను అమ్ముతూ ఉండడం విశేషం. ముఖ్యంగా ఎల్ఐసి అందిస్తున్న అనేక రకాల పాలసీలలో కొన్ని రకాల పాలసీలు ఎప్పటికప్పుడు బాగా పాపులర్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన ఎల్ఐసి జీవన్ ఆజాద్ పాలసీ తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీని అందించడానికి సిద్ధమయ్యింది. ముఖ్యంగా వ్యక్తిగత పొదుపు జీవిత బీమా బెనిఫిట్స్ ఈ పథకం ద్వారా పొందవచ్చు. కనీసం సమ్ అస్యూర్డ్ రెండు లక్షలు రూపాయలు ఉండాలి.n గరిష్టంగా ఐదు లక్షల రూపాయల ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఈ పాలసీ తీసుకున్న మనిషి మరణిస్తే వారి కుటుంబానికి ఈ పథకం ఆర్థిక మద్దతు ఇస్తుంది.
మెచ్యూరిటీ తర్వాత కూడా పాలసీ హోల్డర్లకు మంచి బెనిఫిట్స్ లభిస్తాయి. 90 రోజుల నుండి 50 సంవత్సరాల వయసు ఉన్న ఎవరైనా సరే ఇందులో పాలసీ తీసుకోవడానికి అర్హులవుతారు. ముఖ్యంగా ఈ పాలసీటర్ను 20 సంవత్సరాల వరకు ఉంటుంది ఉదాహరణకు 15 సంవత్సరాల పాలసీ టర్మ్ తీసుకుంటే ఏడు సంవత్సరాల పాలసీ చెల్లించాలి. పాలసీ కొనసాగిస్తున్న సమయంలో ఒకవేల వ్యక్తి మరణిస్తే నామినీకి డెత్ బెనిఫిట్ కూడా లభిస్తుంది . మెచ్యూరిటీ బెనిఫిట్ కింద రెండు లక్షల రూపాయలను పొందే అవకాశం ఉంటుంది. అందుకు మీరు ప్రతి ఏటా ప్రీమియం 1,283 రూపాయలు చెల్లిస్తే 18 ఏళ్ల తర్వాత రెండు లక్షల రూపాయలు లభిస్తాయి.