మనీ: ప్రతినెల ఆదాయం కావాలంటే.. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయాల్సిందే..!

Divya
కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో రకాల పొదుపు పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ప్రజల నుంచి మంచి డిమాండ్ ఉంటుంది. కేంద్ర బడ్జెట్ 2023 లో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ రెట్టింపు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పథకంలో రూ.4,50,000 వరకు మాత్రమే పొదుపు చేయవచ్చు ఈ లిమిట్ ను రెట్టింపు చేసి రూ.9,00,000 కి కేంద్ర ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం జాయింట్ అకౌంట్ కు రూ.9,00,000 పొదుపు చేసే అవకాశం ఉండగా ఆ లిమిట్ ను ఇప్పుడు రూ.15 లక్షలకు ప్రభుత్వం పెంచింది. ఇక పెరిగిన లిమిట్ కూడా 2023 ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వచ్చింది.

ఇక పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే.. 2023 జనవరి నుంచి మార్చి మధ్య ఈ పథకానికి 7.1% వడ్డీ లభిస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలు వడ్డీ రేట్లు సవరిస్తూ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఈ పథకాల వడ్డీ రేట్లు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు లేదా ఒకవేళ స్థిరంగా ఉన్న ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఇక పెరిగిన లిమిట్ ప్రకారం మీరు తొమ్మిది లక్షల రూపాయలను పొదుపు చేస్తే ప్రతి నెల రూ.5,325 వడ్డీ లభిస్తుంది అలాగే జాయింట్ అకౌంట్ లో మీరు 15 లక్షలు పొదుపు చేస్తే ప్రతి నెల. రూ.8,875 వడ్డీ రూపంలో పొందవచ్చు.
ముఖ్యంగా ఈ మంత్లీ ఇన్కమ్ స్కీం పథకాన్ని మీరు ఐదు సంవత్సరాలు పాటు కొనసాగించే అవకాశం ఉంటుంది పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో కనీసం 1000 రూపాయలు పొదుపు చేసి ఖాతా ఓపెన్ చేస్తే 10 సంవత్సరాలు దాటిన మైనర్ తమ పేరుపైన కూడా ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో పేరు నమోదు చేయించుకోవచ్చు ఇలా ఎవరైనా సరే ఇందులో డబ్బు ఆధార్ చేసుకొని ప్రతినెల డబ్బు పొందే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: