మనీ: మహిళలకు శుభవార్త.. వారి ఖాతాల్లో రూ.6 వేలు జమ..!
ఈ పథకానికి మాతృత్వ వందన యోజన అని పేరు కూడా పెట్టారు. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తున్న చాలామంది మహిళలు ప్రసూతి సెలవుల తర్వాత తిరిగి ఉద్యోగాలలో చేరలేకపోతున్నారు. దీనివల్ల బాధిత మహిళల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ముఖ్యంగా 2017 నుంచి వివాహిత మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న పుట్టిన పిల్లలు పోషకాహార లోపంతో బాధపడకుండా.. ఎటువంటి వ్యాధుల బారిన పడకూడదని లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు..
ముఖ్యంగా గర్భిణీ స్త్రీల వయసు 19 సంవత్సరాల కు తక్కువ ఉండకూడదు . దీనిని మీరు ఆఫ్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి . అంటే దగ్గర్లో ఉన్న అంగన్వాడీ సెంటర్ కి వెళ్లి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే ఈ పథకంలో చేరిన గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం మూడు వాయిదాలలో 6000 రూపాయలను అందిస్తుంది. గర్భిణీ స్త్రీలకు దశలవారీగా 1000 రూపాయలు, రెండవ దశలో 2000 రూపాయలు, మూడవ దశలో 2000 రూపాయలను అందజేస్తారు. ఆ తర్వాత బిడ్డ పుట్టగానే ప్రభుత్వ ఆసుపత్రిలో చివరి విడతగా మరో వెయ్యి రూపాయలను అందజేస్తారు. ఈ పథకంలో మీకు ఏదైనా సమస్య అనిపించినట్లయితే వెంటనే అధికారిక హెల్ప్ లైన్ నెంబర్.. 7998799804 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించవచ్చు. నేరుగా గర్భిణీ ఖాతాలోకి డబ్బు జమ అవుతుంది.