మనీ: వేసవికాలంలో మీ ఆదాయాన్ని పెంచే అద్భుతమైన వ్యాపారం ఇదే..!

Divya
వేసవికాలం అనగానే ఎక్కువగా నీరు ఖర్చయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మన శరీరం వేడికి నీటిని బయటకు పంపిస్తూ ఉంటుంది . తద్వారా శరీరంలో నీటి నిలువలు తగ్గిపోతూ ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు నీటిని తాగుతూ ఉండాలి అని.. నీటికి బదులుగా కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి కూడా తాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ వేసవికాలంలో నీటిని మీరు వ్యాపారంగా మార్చుకుంటే ఖచ్చితంగా ఆదాయం రెట్టింపు అవుతుంది.. అయితే ఎంత పెట్టుబడి కావాలి .. ఎక్కడ మొదలు పెట్టాలి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం..
ఈ వేసవికాలంలో నీళ్ల బాటిళ్లకు చాలా డిమాండ్ ఉంది ఈ సమయంలో మీరు కూడా ఈ బిజినెస్ మొదలుపెట్టి బాగా సంపాదించవచ్చు.  పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు.  అలాగే సంపాదన కూడా చాలా త్వరగా అధిక మొత్తంలో రావడం ప్రారంభం అవుతుంది. మీరు కూడా కొత్తగా వ్యాపారం పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వ్యాపారం చక్కటి ఆదాయాన్ని అందిస్తుందని చెప్పాలి. ఇకపోతే మార్కెట్లో చాలా బ్రాండ్ల వాటర్ బాటిళ్లు చూసే ఉంటారు. మీరు ఒక లీటర్ , రెండు లీటర్, 5 లీటర్, 10 లీటర్ , 20 లీటర్ల జాడీలను కూడా తయారు చేయవచ్చు. అంతేకాదు మీరే మీ బ్రాండ్ ను ఓన్ గా నిర్మించవచ్చు అలాగే ఈ బాటిల్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో ఇప్పుడు చూద్దాం.
వాటర్ బాటిల్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన యంత్రాలు ఇతర వస్తువులను కొనుగోలు చేయాలి అలాగే నిల్వ ట్యాంక్ తో పాటు నీటిని ఫిల్టర్ చేయడానికి 6 యంత్రాన్ని కొనుగోలు చేయాలి . అలాగే ల్యాబ్ నుండి ఫీడ్ వాటర్ టెస్ట్ రిపోర్ట్,  బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నుండి ఐఎస్ఐ ధ్రువీకరణ,  స్థానిక పొల్యూషన్ బోర్డు కార్యాలయం నుండి పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్లు కూడా తీసుకోవాలి . అలాగే స్థానికంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆరోగ్యశాఖ నుండి వ్యాపార అనుమతులు కూడా పొందాలి . అలాగే జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలి. మీకు ఒక లీటర్ వాటర్ బాటిల్ పైన నాలుగు రూపాయల ఆదాయం అనుకుంటే రెండు వేల లీటర్ల నీరు సరఫరా చేస్తే కనీసం రోజుకు 8,000 లాభం మీకు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: