మనీ: నెలకు రూ.5 వేలు ఆదాతో భారీ లాభం..!

Divya
డబ్బులు రెట్టింపడానికి చాలామంది పెట్టుబడి మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే పథకాలను బట్టి వచ్చే రాబడి కూడా ఆధారపడి ఉంటుంది. అంతిమంగా బెస్ట్ బెనిఫిట్స్ కోసమే ఎవరైనా సరే డబ్బులు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల పథకాలు తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలంలో ఎక్కువ రాబడిని అందిస్తున్నాయి. అలాంటి పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఒకటి. ఇందులో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఈ పథకంలో డబ్బులు భద్రతతో పాటు మంచి రాబడి కూడా పొందవచ్చు.
ఒకవేళ మీరు కూడా ఈ పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నట్లయితే రూ.5వేల డిపాజిట్ తో రూ.42 లక్షల రూపాయల వరకు సొంతం చేసుకోవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో లాంగ్ టర్మ్ లో మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది.  ఇక ప్రతి సంవత్సరం కూడా రూ.1.5లక్షల వరకు మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు. అంతేకాదు రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ తో పాటు అధిక వడ్డీ కూడా లభిస్తుంది. ప్రస్తుతం 7.1 శాతానికి వడ్డీ లభిస్తోంది. కాబట్టి ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మంచి ఉత్తమమైన పని. ఇక 15 సంవత్సరాల కు ఈ పథకం మెచ్యూరిటీ అవుతుంది.
కావాలంటే మీరు మరో ఐదు సంవత్సరాల పాటు పథకాన్ని పొడిగించుకోవచ్చు.  సెక్షన్ 80 C కింద టాక్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఇకపోతే ఈ పథకంలో వచ్చే వడ్డీ మొత్తం కూడా పన్ను రహితం కావడం విశేషం.  అంతేకాదు ఐదేళ్ల డిపాజిట్ పూర్తయిన తర్వాత ఈ పథకంలో లోన్ కి కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే ప్రతి నెల 5000 రూపాయల చొప్పున 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి అప్పుడు మెచ్యూరిటీ సమయానికి మీ డబ్బు రూ.16,27,284 అవుతుంది.. మరో 10 సంవత్సరాలు పొడిగించుకుంటే 25 సంవత్సరాలకు గాను రూ.15,12,500 వడ్డీ కాగా రూ.26, 45,066 కి చేరుకుంటోంది.మొత్తం కలిపి  రూ.41,57,566  మీ చేతికి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: