Money: కేవలం రూ.20 తో రూ.2 లక్షలు.. మీ జీవితానికి శ్రీరామరక్ష..!

Divya
ఈ మధ్యకాలంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతోంది. ఎప్పుడు ఏ సమయాన వారు స్వర్గస్తులవుతారో కూడా చెప్పడం కష్టంగా మారిపోయింది. అంతేకాదు అనారోగ్య సమస్యలు ప్రబలిస్తున్నాయి మరొకవైపు రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారు కోకొల్లలు.. దేశంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి సంఘటనలు జరుగుతూ అర్ధాంతరంగా ఎంతోమంది తనువు చాలిస్తున్నారు. ఇక ఆ తర్వాత తమ కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టేస్తున్నారని చెప్పాలి. ఇక మరి కొంతమంది మరణించి జీవితాన్నే కోల్పోతే మరికొంతమంది శాశ్వత అంగ వైకల్యం పొంది కుటుంబాలకు భారంగా మారుతున్నారు.
ఇక అలాంటి వారి పాలిట ఇప్పుడు అండగా ఉండడానికి ఉద్దేశించిందే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం. దీని గురించి వివరించి చెప్పాలి అంటే ఇదొక ప్రమాద బీమా పథకం అని చెప్పవచ్చు.  పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించిన లేదా అంగవైకల్యం పొందిన సరే ఈ పథకం వారికి అండగా నిలుస్తుం..ది అంతేకాదు మరణించిన వారి కుటుంబాలకు ఈ పథకం శ్రీరామరక్ష అని చెప్పవచ్చు. 18 నుంచి 70 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న వారు మాత్రమే ఈ పథకంలో చేరడానికి అర్హులవుతారు.
ఇందుకోసం ఏదైనా బ్యాంకులో పొదుపు ఖాతా తప్పనిసరిగా ఉండాల్సిందే. ఒకటికంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నట్లయితే అప్పుడు ఏదైనా ఒక బ్యాంకు ఖాతా కి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.  ఎన్నారైలు కూడా ఈ పథకంలో చేరడానికి అర్హులే.. అయితే క్లైమ్ డబ్బును మాత్రం నామినీకి భారత కరెన్సీలో చెల్లిస్తారు. కేవలం ఏడాదికి 20 రూపాయల చొప్పున ప్రీమియం చెల్లిస్తే దీని కాలపరిమితి ఒక సంవత్సరం కాబట్టి ప్రతి ఏటా దీనిని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ పథకంలో చేరిన పాలసీదారుడు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయిస్తూ 20 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. జరిగిన సంఘటనలలో పాలసీదారుడు మరణిస్తే లేదా శాశ్వత అంగవైకల్యం కలిగితే 2 లక్షల రూపాయలు, పాక్షిక వైకల్యానికి గురైతే లక్ష రూపాయల పరిహారం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: