Money: కష్టపడకుండా ప్రతినెలా ఆదాయాన్నిచ్చే ఎల్ఐసి స్కీమ్..!

Divya
ప్రతినెల అద్భుతమైన రాబడి పొందాలి అనుకుంటే మీకు ఒక అద్భుతమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ పాలసీలో చేరితే ప్రతి నెల క్రమం తప్పకుండా డబ్బులు పొందవచ్చు. ఇంతకీ ఆ పాలసీ ఏమిటి అని అనుకుంటున్నారా అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోండి.

ఎల్ఐసి అందిస్తున్న జీవన్ శాంతి పెన్షన్ ప్లాను కేవలం కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది.  అంటే 30 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాల వరకు వయసు కలిగిన వారు మాత్రమే ఈ పథకంలో చేరడానికి అర్హులవుతారు. ఈ పథకంలో చేరడం వల్ల ప్రతినెల పెన్షన్ లభిస్తుంది. ఒకవేళ పాలసీదారుడు మరణించినట్లయితే భీమా డబ్బులు కూడా అందిస్తారు. నామినీకి ఈ మొత్తం ఒకేసారి లభిస్తుంది. ప్రతినెలా పెన్షన్ రూపంలో లభించే మొత్తాన్ని నామిని ఒకేసారి భారీ మొత్తంలో తీసుకుంటారు.

ఇకపోతే ఎల్ఐసి అందిస్తున్న జీవన్ శాంతి ప్లాన్ తీసుకోవాలంటే ఒకేసారి డబ్బులు మీరు కట్టాల్సి ఉంటుంది. ప్రతినెలా పెన్షన్ పొందాలనుకునేవారు ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలి. ఇకపోతే ఒక్కసారి ఒక్క ఆప్షన్ ఎంచుకుంటే మళ్ళీ మీరు దానిని మార్చుకోవడం కుదరదు. పాలసీ తీసుకున్న 12 ఏళ్ల వరకు యాన్యుటీ డిఫర్డ్ ఆప్షన్ లు ఉంటాయి. అంతేకాదు జాయింట్ లైఫ్ ఆప్షన్ కూడా ఉంటుంది. పాలసీదారుడు మరణించిన  తర్వాత బీమా మొత్తం పొందాలా  వద్దా అన్న ఆప్షన్ కూడా ఉంటుంది.

ఇకపోతే రూ .1.5 లక్షల మొత్తానికి బీమా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి ఏమీ లేదు కాబట్టి మీరు ఎంత మొత్తంలో అయినా పాలసీ తీసుకోవచ్చు. నెలకు ₹1000 నుంచి రూ .12 వేల వరకు పొందే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా పెన్షన్ లభిస్తుంది. ఉదాహరణకు మీరు రూ .10 లక్షల పెట్టి ఈ పాలసీలో చేరితే.. 12 సంవత్సరాల తర్వాత నెలకు రూ.11,192 వరకు లభిస్తాయి. పూర్తి వివరాల కోసం దగ్గర్లో ఉన్న ఎల్ఐసి బ్రాంచ్ ను సంప్రదించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: