మనీ: అధిక వడ్డీ కావాలంటే ఈ పథకాలలో పెట్టుబడి పెట్టాల్సిందే..!
తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేట్లను కూడా పెంచిన నేపథ్యంలో వడ్డీరేట్లు బాగానే పెరిగాయని చెప్పాలి ముఖ్యంగా ఫిక్స్ డిపాజిట్ లతో పోల్చుకుంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లో కొన్ని పథకాలకు భారీగానే వడ్డీ లభిస్తుంది అని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా వడ్డీ రేటును మెచ్యూరిటీ అయిన డిపాజిట్లపై చాలా బ్యాంకులు అందిస్తున్నాయి. వీటితో పాటూ మూడు పీఓటీడీపై వడ్డీ రేటు కూడా 5.5% నుంచి 7 శాతానికి పెరిగింది. ఇక చిన్న పొదుపు పథకాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం, మొదటి త్రైమాసికానికి ప్రభుత్వం వడ్డీ రేట్లు సుమారుగా 10 నుంచి 70 బేసిస్ పాయింట్లకు పెంచింది. అలాగే మొదటి సంవత్సరం 6.8% వుండగా , రెండవ సంవత్సరం 6.9% వడ్డీ అందిస్తున్నారు. మూడవ సంవత్సరం 7.0% వడ్డీ, ఇక ఐదవ సంవత్సరం 7.5% వడ్డీ రేట్లు వున్నాయి.
పోస్ట్ ఆఫీస్ లో సరైన రాబడి రావడంతో పాటు మీకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఎక్కువగానే లభిస్తాయి. అలాగే డెత్ క్లైమ్ కూడా మీరు చేసుకోవచ్చు. అందుకే చిన్న పొదుపు సంఘాలు మీకు ఎక్కువ ఆదాయాన్ని అందిస్తున్నాయని.