Money: విద్యార్థుల కోసం ప్రత్యేకం ..డబ్బు సంపాదించే మార్గాలు ఇవే..!

Divya
సాధారణంగా చాలామంది విద్యార్థులు ఆర్థిక సమస్యల కారణంగా చదువుకు అంతరాయం కలిగించుకుంటూ ఉంటారు. అయితే మరికొంతమంది పాకెట్ మనీ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే విద్యార్థి దశ నుంచి డబ్బు సంపాదించడం పై ఆలోచన పెడితే ప్రతి చిన్న విషయానికి ఇంట్లో వాళ్లపై ఆధార పడాల్సిన అవసరం రాదు. చదువుకుంటూనే ఆర్థికంగా ఇంట్లో వాళ్లకి భారం కూడా తగ్గించవచ్చు ఇకపోతే స్టూడెంట్ దశలో ఉన్నప్పుడే ఈజీగా డబ్బులు ఎలా సంపాదించాలి అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ఫ్రీలాన్స్ రైటింగ్.. ఇందులో మార్కెటింగ్ కంటెంట్ ను ప్రమోట్ చేసే జాబులు ఉంటాయి. మీకు భాష పై మంచి పట్టుతో పాటు రాసే స్కిల్స్ కూడా ఉంటే చాలు.. పెద్ద పెద్ద బిజినెస్ లకి కూడా రచయితలు చాలా అవసరం కాబట్టి రివ్యూలు,  బ్లాగ్ ఎంట్రీలు, టెక్నికల్ రైటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, సోషల్ మీడియా పోస్టు, న్యూస్ లెటర్లు ఇలా ఎన్నో రాయడం మీకు వచ్చి ఉండాలి. ఇది ఉద్యోగం లేకపోయినా మీకు ఉద్యోగాన్ని సంపాదించి పెడుతుంది. డబ్బు సంపాదించడానికి ఇది ఒక చక్కటి మార్గమని చెప్పవచ్చు.
 ఇక మరొకటి యూట్యూబ్ వ్లాగర్.. ఇందులో మీరు ఎప్పుడైనా సరే కంటెంట్ ని షేర్ చేయవచ్చు మీరు బాగా ఫేమస్ అవ్వడానికి యూట్యూబ్లో వీడియోలు పెట్టి డబ్బులు చేయడానికి ఇదొక చక్కటి మార్గమని చెప్పవచ్చు. అలాగే టీ షర్ట్ డిజైనింగ్ చేసి అమ్మవచ్చు. ముఖ్యంగా టీ షర్టులను తయారు చేసి ఆన్లైన్లో విక్రయించడం లేదా మార్కెట్లో ప్లేన్ టీ షర్టులను తీసుకొచ్చి వాటిపై ప్రింటింగ్ వేసి అమ్మడం లాంటివి చేసినా సరే మీకు మంచి ఆదాయం లభిస్తుంది.
అంతేకాదు మీకు మల్టీ లాంగ్వేజ్ స్కిల్ ఉంటే మీరు ట్రాన్స్లేటర్ గా కూడా పనిచేయవచ్చు. వివిధ ప్లాట్ఫారం లలో ట్రాన్స్లేటర్లకు మంచి డిమాండ్ ఉంది కాబట్టి మీరు కూడా ఆ పని చేసి డబ్బు సంపాదించే వీలుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: