Money: భారీ ఆదాయాన్నిచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం ఇదే..!
అతిపెద్ద రుణదాతలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్డిఎఫ్సి వంటి బ్యాంకులైతే ఏకంగా సీనియర్ సిటిజనులకు 7.5% వడ్డీ అందిస్తూ వారికి ఆసరాగా నిలుస్తున్నాయి. ఇక ఒక బ్యాంకుల్లోనే కాదు పోస్ట్ ఆఫీస్ లో కూడా ఇప్పుడు మంచి వడ్డీ రేటు లభిస్తోంది ఈ క్రమంలోనే ఫిక్స్డ్ డిపాజిట్ ల ద్వారా ఎంత మొత్తంలో రాబడి పొందవచ్చు అనే విషయాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. సాధారణంగా ఎస్బిఐ బ్యాంకులో లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే సంవత్సరానికి రూ.6,396 పొందవచ్చు. ఈ ఆరు నెలల వ్యవధికి గాను సీనియర్ సిటిజనులకు 6.25% వడ్డీ రేటు లభిస్తుంది. అదే మూడు సంవత్సరాల క్రితం ఏడు శాతంతో రూ .23,144 వడ్డీ లభిస్తుంది. 10 సంవత్సరాలకైతే 7.5% చొప్పున రూ.1,10,235 వడ్డీగా పొందవచ్చు.
ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకు విషయానికి వస్తే లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సీనియర్ సిటిజెన్లకు 7.1% వడ్డీ లభిస్తుంది . అదే నగదు పై మూడు సంవత్సరాల వ్యవధికి 7.5% వడ్డీ అంటే రూ.24,972 వడ్డీగా పొందవచ్చు. ఇక 10 సంవత్సరాల పాటు ఫిక్స్ డిపాజిట్ చేసినట్లయితే 7.75% వడ్డీ రేటు కలుపుకొని రూ.1,15,456 నగదును వడ్డీ రూపంలో పొందవచ్చు. కాబట్టి మీకు నచ్చిన బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు.