Money : హోమ్ లోన్ పొందాలనుకునే వారికి శుభవార్త..!
ఇప్పటివరకు కొత్త ఇల్లు కొనుగోలు లేదా నిర్మించుకోవాలనుకునే వారికి బ్యాంకులు 30 సంవత్సరాల గరిష్ట కాలపరిమితితో ఇంటి రుణాలను మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ గరిష్ట జాబితాను బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇటీవల పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గరిష్ట పదవీ కాలాన్ని 30 నుంచి 40 సంవత్సరాల వరకు పొడిగించింది. ఇక ఇది మీరు నెలకు చెల్లించే ఈఎంఐ మొత్తాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.. ఇకపోతే ఈ 40 ఏళ్ల టెన్యూర్ అనేది వినియోగదారులకు అంత ప్రయోజనకరం కాదు అని నిపుణులు కూడా చెబుతున్నారు..
ఇకపోతే హోమ్ లోన్ తీసుకునేవారు అధిక టెన్యూర్ పెట్టుకొని లోన్ తీసుకుంటే నెలకు చెల్లించే ఈఎంఐ కూడా తగ్గుతుంది. ఇక ఇది రూ .లక్షకు రూ .733 నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వద్ద సంవత్సరానికి 8.5% వడ్డీ రేటు పై హోం లోన్ అందిస్తున్నారు. ఇకపోతే హౌసింగ్ ఫైనాన్స్, ప్రొవైడర్ హోమ్ లోన్ దరఖాస్తు సమయంలో రుణాలు తీసుకునేవారు తమ వయసుకు లోబడి పదవీ కాల పరిమితులను సవరించుకోవచ్చు. హోమ్ లోన్ తీసుకునేవారు 23 నుంచి 75 సంవత్సరాల లోపు ఉండాలి. ఇకపోతే 23 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తులు మాత్రమే పూర్తి 40 సంవత్సరాల రుణ కాల పరిమితిని పొందవచ్చు. హోమ్ లోన్ తీసుకునే ముందు మీరు చెల్లించ గలిగే మొత్తానికి తగ్గట్టుగానే లోన్ మొత్తాన్ని ఎంపిక చేసుకుంటే ఈఎంఐ తక్కువ పడుతుంది. వడ్డీ భారం ఎక్కువ అవదు.