Money: రూ.15 వేలు ఉంటే చాలు డబుల్ లాభం పొందే అవకాశం..!

Divya
చాలాకాలం తర్వాత మరొకసారి ఒక బ్యాంకు ఐపిఓ ఇప్పుడు ప్రారంభం అయింది. బ్యాంకు చిన్నదే అయినా సరే దాని బ్యాలెన్స్ షీట్ మాత్రం చాలా బలంగా ఉందని చెప్పవచ్చు. అదే ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఈనెల 12వ తేదీన ఐపిఓ ప్రారంభం అయిన వెంటనే జనం పెట్టుబడి పెట్టడానికి చాలా ఆసక్తి చూపించారు. ముఖ్యంగా రిటైల్ పెట్టుబడిదారులు ఈ బ్యాంక్ ఐపీఓ కోసం జూలై 12 తేదీ నుండి జూలై 14 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ ఐపీఓ 7సార్లకు పైగా ఫుల్ సబ్స్క్రైబ్ నిండిపోయిందట.
ముఖ్యంగా గరిష్ట రెటైల్ భాగం ఇప్పటివరకు ఏడుసార్లు సబ్స్క్రిప్షన్ పొందిందని పెట్టుబడికి కేవలం ఈరోజు మాత్రమే చివరి సమయమని బ్యాంకు వెల్లడించింది. ముఖ్యంగా ఈ ఐపీఓ కోసం ధర బ్యాండ్ రూ.23-25 గా నిర్ణయించినట్లు సమాచారం ఇకపోతే రిటైల్ ఇన్వెస్టర్ కనీసం ఒక లార్డ్ కోసం మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.. అంటే ఒక లాట్ లో సుమారుగా 600 షేర్లు ఉంటాయి అంటే దీనికోసం మీరు 15 వేల రూపాయలను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్టంగా 13 లాట్లకు బిడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా మీరు కూడా బిడ్ చేయాలని అనుకున్నట్లయితే సుమారుగా రూ.1,95,000 చెల్లిస్తే సరిపోతుంది.
ఇకపోతే ఐపీఓ యొక్క కేటాయింపు జూలై 19వ తేదీ వరకు ఉంటుంది కాబట్టి జూలై 24 వరకు బిఎస్ఈ మరియు ఎన్ఎస్ఈ లలో స్టాక్ లిస్టింగ్ చేయబడింది. బ్యాంకు యొక్క ఐపీఓ ఇష్యూలో మొత్తం 75% క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ కొనుగోలుదారులకు, అలాగే నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15% అలాగే 10% రిటర్న్ ఇన్వెస్టర్లకు కేటాయించబడుతుంది కాబట్టి మీరు త్వరగా దీనిలో చేరి మీ డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: