Money: భార్యాభర్తల కోసం అదిరిపోయే స్కీమ్..!
ఇక ఈ క్రమంలోనే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకం కూడా ఒకటి. 2019 నుంచి ఈ పథకం అందుబాటులో ఉండగా భార్యాభర్తలిద్దరూ కూడా ఈ పథకంలో చేరి నెలకు రూ .200 కడితే చాలు ఏడాదికి రూ.75,000 మీ సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా పలు రకాల పనులు చేసుకునే వారు కూడా ఈ పథకంలో చేరడానికి అర్హులు.ఇక నెలవారీ ఆదాయం రూ .15 వేలకు మించి ఉండకుండా ఉంటే ఎవరైనా సరే ఈ పథకంలో చేరి ఆదాయాన్ని పొందవచ్చు.
ఉదాహరణకు 30 సంవత్సరాల మీకుంటే ఈ పథకంలో చేరితే నెలకు 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇలా 60 సంవత్సరాల వరకు ఇద్దరూ భార్యాభర్తలు నెలకు 200 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇలా ఇద్దరూ చేరితే ఏడాదికి 72 వేల రూపాయలను బ్యాంక్ అకౌంట్ నేరుగా మీ ఖాతాలోకి వేస్తుంది. మీరు కావాలంటే ప్రతి నెల కొంత మొత్తంలో పెన్షన్ రూపంలో పొందవచ్చు. ఇకపోతే ఇందులో ఖాతా తెరవడానికి బ్యాంక్ అకౌంట్, మొబైల్ ఫోను, ఆధార్ కార్డు ఉన్నవారు దగ్గర్లో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి ఈ పథకంలో చేరవచ్చు. అంతేకాదు ఇక్కడ పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.