Money: మహిళలకు కేంద్రం శుభవార్త..!

Divya
కేంద్ర ప్రభుత్వం తాజాగా దేశంలో ఉన్న ప్రజల కోసం ప్రత్యేకించి మహిళల కోసం ప్రత్యేకమైన పథకాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న నేపథ్యంలో మహిళల అభివృద్ధి కోసం ఒక అడుగు ముందుకు వేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వారికి మరొక శుభవార్త వెల్లడించింది. మహిళలకు సాధికారత కల్పించడంతోపాటు ఆదాయాన్ని కల్పించే దిశగా పలు పథకాలను అమలుపరుస్తోంది. ఇందులో భాగంగానే మహిళ ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రోత్సహించే దిశగా చేపట్టిన పథకం ప్రధానమంత్రి ఉచిత కుట్టు మిషన్ పథకం.

ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అర్హులైన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేస్తోంది  ఇప్పటికే కుట్టుమిషన్లు అందించడం ద్వారా మహిళలు ఇంట్లోనే కూర్చుని తమ ఆదాయాన్ని పెంచుకునే విధంగా కేంద్రం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో మహిళలు స్వతంత్రంగా జీవించడమే కాదు తమ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని కూడా అందించగలరు అన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ముఖ్యంగా అర్హులైన మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని.. తద్వారా ఉచితంగా కుట్టు మిషన్లను పొందవచ్చు అని కేంద్రం చెబుతోంది.

ఇక అర్హులైన మహిళలు ఈ పథకం కింద ఉచితంగా కుట్టు మిషన్ ని పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకానికి అర్హత పొందాలి అంటే నిర్దిష్ట ప్రమాణాలతో పాటు సదరు మహిళ వయసు 20 నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి. భారత పౌరసత్వం కలిగి ఉండడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఈ కుట్టు మిషన్లను అందజేస్తారట. అంతేకాదు ఆ మహిళ భర్త వార్షిక ఆదాయం 12 వేల రూపాయలకు మించి ఉండకూడదు. వితంతువులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకానికి ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అర్హత కలిగిన మహిళలు www. India.gov.in అనే వెబ్సైట్ ద్వారా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: