మనీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!

Divya
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతి ఏడాదికి రెండుసార్లు డిఎ పెంచుతూ ఉన్న సంగతి తెలిసిందే.. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇ డీఎ అమలులోకి వస్తూ ఉంటుంది. అయితే ఇది ఉన్న ద్రవ్యోల్బణం ఆధారంగా డిఏ పెరుగుతూ ఉంటుంది. అయితే వచ్చే ఏడాది జనవరిలో డిఏ 50 శాతం దాటబోతున్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం ఉన్న డిఏ 42 శాతం ఉన్నది.. ఇది జనవరి 2023 నుంచి అమలులోకి రావడం జరిగింది. ఇప్పుడు తాజాగా మళ్లీ జూన్ నెలలో పెరగాల్సిన డిఏ బకాయిలు ఇంకా పెరగలేదు..


అయితే జూన్ లో పెరగాల్సిన డిఎ ని రక్షాబంధన్ లేదా దసరాకు పెంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు మరొకసారి నాలుగు శాతం డిఏ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది .42 శాతం నుంచి 46% వరకు పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం..మళ్లీ వచ్చే సంవత్సరం 2024 జనవరిలో డిఎ 50 శాతం దాటే అవకాశం కూడా ఉన్నట్లు కనిపిస్తోంది.. అలాగే ప్రస్తుతం ఉన్న ఈ డిఏ ను ఏడవ వేతనం సిఫార్సు కింద జారీ చేసినట్లుగా తెలుస్తోంది..


అలాగే రాబోయే రోజుల్లో 8వ వేతనం సిఫార్సును కూడా తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజ్యసభలో ఇటీవల పార్లమెంటు సమావేశంలో భాగంగా అక్కడ కొంతమంది నాయకులు సైతం ప్రశ్న వేయక అందుకు సంబంధించిన సమాధానాన్ని కేంద్రమంత్రి పంకజ్ చౌదరి తెలియజేయడం జరిగింది . అయితే ఇప్పట్లో ఎనిమిదో వేతనం తీసుకువచ్చే ఆలోచనలో లేదన్నారు.. ఇది వరకు కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.. ప్రస్తుతం ఉన్న ద్రవయోల్బణం ఆధారంగా..AICIP IW ఇండెక్స్ ఆధారంగా లెక్కిస్తారని తెలియజేశారు అంటే ఇప్పట్లో 8వ వేతనం సిఫార్సు లేనట్టే కానీ దీనికితోడు ఏడవ వేతనం సిఫార్సు మేరకు డిఏ మాత్రం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దీంతో 50% దాటే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: