Money: అదిరిపోయే స్కీమ్ తో ఎస్బిఐ.. ప్రతి నెల డబ్బులే..!

Divya
ప్రతి నెల మీరు మీ ఖాతాలో డబ్బు పొందాలి అనుకుంటున్నట్లయితే మీకోసం కొన్ని రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఎస్బిఐ అందించే పథకం కూడా ఒకటి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇందులో చేరితే ప్రతి నెల డబ్బులు పొందడమే కాదు మీ డబ్బుకు పూర్తి సెక్యూరిటీ కూడా లభిస్తుంది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు గా కొనసాగుతున్న ఎస్బిఐ తన కస్టమర్ల కోసం ఒక స్పెషల్ స్కీంను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీని పేరు ఎస్బిఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్.

ఎస్బిఐ ప్రకారం చూసుకున్నట్లయితే మూడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. 36 ,60, 12 నెలలు అనే విధంగా ఆప్షన్లను మీరు ఎంచుకోవచ్చు.  మీకు నచ్చిన దాన్ని ఎంచుకొని అందుకు అనుగుణంగా ప్రతి నెల డబ్బులు పొందవచ్చు. అయితే ఇందులో కనీసం వెయ్యి రూపాయల నుంచి మీరు డబ్బు పొందే అవకాశం ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా మీకు వచ్చే యాన్యుటీ కూడా మారుతుంది అన్న విషయాన్ని గమనించాలి.

అయితే ఈ స్కీంలో చేరితే లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. దగ్గర్లోని బ్యాంకుకు వెళ్లి మీరు ఈ స్కీం యొక్క పూర్తి వివరాలను తెలుసుకొని ఇందులో చేరవచ్చు. మీకు నచ్చిన మొత్తాన్ని డిపాజిట్ చేసుకొని అందుకు అనుగుణంగా ప్రతినెల డబ్బు పొందవచ్చు. ఈ స్కీమ్ లో చేరాలని భావించేవారు కనీసం 25 వేల రూపాయలను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో గరిష్టంగా 7.5% వడ్డీ లభిస్తుంది. రాబడి పొందాలని భావించేవారు ఈ పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి ప్రతినెల వడ్డీ రూపంలో ఉండవచ్చు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ప్రతి నెల మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో కొంత భాగం,  అలాగే వడ్డీ రెండూ కలిపి చెల్లిస్తారు. కాబట్టి మెచ్యూరిటీ సమయంలో మీకు ఎటువంటి డబ్బులు రావు అని గుర్తించుకోవాలి. ఇక మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఖాళీగా వాటిని దాయడం కంటే ఇలా ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల రాబడి పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: