Money: రూ.1000 ఆదా తో కోటి కి పైగా ఆదాయం..!
60 ఏళ్లు లేదా 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రతి నెల డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి చేతికి భారీ మొత్తాన్ని పొందవచ్చు. అంతేకాదు ఇక్కడ పన్ను మినహాయింపు కూడా మీకు లభిస్తుంది. ఈ పథకంలో చేరడం వల్ల మూడు రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఈ స్కీమ్ లో చేరితే ప్రతి నెల డబ్బులు ఇన్వెస్ట్ చేయడం లేదా ఏడాదికి ఒకేసారి డబ్బులు మొత్తం ఇన్వెస్ట్ చేయడం లాంటివి చేయవచ్చు. 60 ఏళ్లు వచ్చిన తర్వాత 60 శాతం డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మిగతా 40 శాతం మొత్తం యాన్యుటీ ప్లాన్ మీరు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇక ఈ స్క్రీన్ తో మీకు ప్రతినెలా పెన్షన్ లభిస్తుంది. కాబట్టి ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా మీకు వచ్చే బెనిఫిట్స్ కూడా మారుతూ ఉంటాయి. 50 వేల వరకు అదనపు టాక్స్ బెనిఫిట్ ను పొందవచ్చు. ఈ స్కీంతో సుమారుగా ఈ రూ .2లక్షల వరకు టాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఉదాహరణకు 30 సంవత్సరాల వయసులో ఉన్నవారు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే వార్షిక రాబడి 10 శాతం ప్రకారం చూస్తే.. ఈ పథకంలో 70 ఏళ్ళు వచ్చేసరికి ₹కోటికి పైగా ఆదాయం లభిస్తుంది. దాదాపు ₹. 21 వేల పెన్షన్ లభిస్తుంది అంటే రూ .64 లక్షలు ఒకేసారి మీ చేతికి అందుతాయి.