హమ్మయ్య.. దిగివచ్చిన టమాటా ధర.. సామాన్యులకు ఊరట?
మార్కెట్లకు మళ్లీ పెద్ద సంఖ్యలో టమాటాలు వస్తూ ఉండగా ఇక ధరలు తగ్గుముఖం పట్టాయి అని చెప్పాలి. దీంతో మళ్లీ సామాన్యుడి వంటగదిలో స్థానం సంపాదించుకోగలుగుతుంది టమాట. అటు ప్రభుత్వం కూడా ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇక ఇటీవలే టమాట కిలో 40 రూపాయల చొప్పున వీక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత రెండు నెలల నుంచి కొనసాగుతున్న టమాటా ధర పెంపు ఇప్పుడు ఆగిపోయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కృషితో ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిన టమాట మళ్ళీ సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. టమాట ధరలు దేశంలో కిలో 300 రూపాయల వరకు చేరుకోగా.. గత జులై 14వ తేదీ నుంచి ప్రభుత్వం ఈ పథకం కింద ప్రజలకు చౌక ధరలకే టమాటాని అందించడం మొదలుపెట్టింది.
ఈ క్రమంలోనే నేటి నుంచి ఇక కిలో టమాట 40 రూపాయలు చొప్పున విక్రయించనున్నారు అని చెప్పాలి. దీంతో సామాన్య ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత నెల నుండి ధర పెరుగుదలను కట్టడి చేయడానికి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా నేషనల్ కో-ఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రాయితీ ధరకు టమాటలను విక్రయిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఎట్టకేలకు టమాటా ధరలు దిగి వచ్చాయి అని చెప్పాలి.