Money: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త..!

Divya
సామాన్య ప్రజలకు త్వరలోనే కేంద్రం శుభవార్త తెలియజేయబోతోంది. వంట గ్యాస్ ధరలను సుమారుగా రూ. 200 వరకు తగ్గించాలని కేంద్రం నిర్ణయించగా త్వరలోనే సిలిండర్ పై రూ.200 తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చు. విపక్షాలకు వంటగ్యాస్ ధరలు ఇప్పుడు ఆయుధంగా మారాయి. అతి త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో గ్యాస్ ధరలు జనం పై ఇప్పుడు తీవ్ర ప్రభావాన్ని చూపించబోతున్నాయి. ముఖ్యంగా గ్యాస్ ధరలను తగ్గిస్తే ప్రజలను తమ వైపు తిప్పుకోవడం చాలా సులభం అని , అధికార ప్రతిపక్ష పార్టీలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఇకపోతే తాజాగా రక్షాబంధన్ సందర్భంగా మోడీ ప్రభుత్వం తక్కువ ధరకే ఎల్పీజీ సిలిండర్లను బహుమతిగా ఇవ్వబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం తో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడానికి మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఖరీదైన ఎల్పిజి సిలిండర్ల చుట్టూ దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ.200 తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించగా ఈ ప్రయోజనం ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సమాచారం.

మరో 24 గంటల్లో గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం ఇకపోతే మహిళలకు రాఖీ సందర్భంగా మోడీ ప్రభుత్వం ఈ బహుమతిని ఇవ్వగలదు అని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం వంట గ్యాస్ దేశంలో 1200 రూపాయలకు చేరుకోగా గత కొన్ని నెలల్లో పెట్రోలియం కంపెనీలు చాలా వరకు మంచి ఆదాయాన్ని అర్జించాయి. గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించడం ద్వారా మోడీ ప్రభుత్వం ఇప్పుడు సామాన్య ప్రజల దృష్టిని ఆకర్షించే పనిలో ఉంది. ముఖ్యంగా వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధర ఆగస్టు నెలలో 100 రూపాయల తగ్గించగా ఇప్పుడు మరో 200 తగ్గించే అవకాశం ఉందని సమాచారం డొమెస్టిక్ సిలిండర్లపై మాత్రమే కాదు కమర్షియల్ సిలిండర్లపై కూడా ధరలు తగ్గించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: