Money: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. వారిపై భారం..!

Divya
ప్రతి నెల ఒకటవ తేదీ లాగానే ఈసారి కూడా అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఇప్పటికే ఎన్నో రూల్స్ అమల్లోకి రాగా.. ఇప్పుడు మరి కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి రావడం గమనార్హం .ఇకపోతే ఈ నిబంధన నుండి వచ్చే మార్పులు ప్రజల రోజు వారి జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపబోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే ఈ నియమాలలో జనన ధ్రువీకరణ పత్రాల వినియోగంలో కొత్త టిసిఎస్ నిబంధనలకు మార్పులు ఉన్నాయి. కాబట్టి ఈ తాజా మార్గదర్శకాల గురించి కూడా సామాన్యులు తెలుసుకోవాలి. ఇకపోతే ముందుగా అక్టోబర్ లో వచ్చే మార్పులను గమనించి జాగ్రత్త పడితే ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇక ఆ నియమాలేంటో ఇప్పుడు చూద్దాం.
జనన, మరణ నమోదు చట్టం.. అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ చట్టం అమలులోకి రాబోతోంది. దీంతో విద్యాసంస్థలో అడ్మిషన్,  డ్రైవింగ్ లైసెన్స్ జారీ , ఆధార్ నంబర్, వివాహ నమోదు లేదా ప్రభుత్వ ఉద్యోగ నియామకం వంటి అనేక అవసరాల కోసం ఇప్పుడు జనన ధ్రువీకరణ పత్రం ఒకే పత్రంగా మారబోతోంది. జననం,  మరణాల జాతీయ,  రాష్ట్రస్థాయి రికార్డులను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇక దీని ప్రకారం పుట్టిన తేదీ,  స్థలాన్ని నిరూపించడానికి అవసరమైన పత్రాల సంఖ్యను తగ్గించడంలో కూడా ఈ నియమం సహాయపడుతుంది.
మరొకటి ₹2000 నోటు చలామణి ఇక అయిపోయింది.  సెప్టెంబర్ 30 లోపు బ్యాంకులో మార్చుకోవాలని అక్టోబర్ 1 నుంచి రూ .2000 నోటు మార్చుకునే అవకాశం ఉండదు అని కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.  ఇక నోట్లను మార్చుకోవడానికి 30 సెప్టెంబర్ 2023 చివరి రోజు అని గుర్తించాలి. ఇక వీటితోపాటు ఆన్లైన్ గేమింగ్ పై 28% పన్ను అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఆగస్టులో వెల్లడించిన విషయం తెలిసిందే. పన్ను గురించి వివరిస్తూ.. ఒక గేమ్ ని వెయ్యి రూపాయలు ఆడి.. ఎవరైనా రూ.300 గెలుచుకుంటే అప్పుడు ప్లేయర్ మళ్లీ రూ.1300 పందెం వేస్తే.. గెలిచిన మొత్తం పై జిఎస్టి చార్జ్ చేయబడుతుంది. వీటితోపాటు ఇంకా కొన్ని రూల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: