Money: దేశ ప్రజలకు పండుగ వేళ శుభవార్త తెలిపిన కేంద్రం.. రూ.500 కే ఎల్పిజి గ్యాస్..!

Divya
ప్రస్తుతం దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల నైవేద్యాలతో, పూజాలంకరణతో తెగ సంబరాలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మరొకవైపు పండుగ వేళ సామాన్య ప్రజలు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అని, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలలో కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగిస్తూ తీసుకున్న నిర్ణయం చాలావరకు సామాన్యుడికి ఊపిరి అందించిందని చెప్పవచ్చు. ఇకపోతే గత కొన్ని రోజులుగా భారత దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు ఘననీయంగా పెరిగిపోతుండడంతో.. సామాన్య, మధ్య తరగతి, పేద ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలోనే గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల కారణంగా నెలవారి ఖర్చులు కూడా గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ ఖర్చులు సామాన్య ప్రజలకు ఇబ్బందులను కూడా సృష్టిస్తున్నాయి. ఇకపోతే తాజాగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరల నుండి దేశంలోని మహిళలు స్వేచ్ఛ పొందవచ్చు అని సమాచారం.  ముఖ్యంగా మహిళలకు, పేద ప్రజలు,  మధ్యతరగతి కుటుంబాలకు చేయూతని ఇచ్చే విధంగా గ్యాస్ సిలిండర్ తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పుడు కేవలం రూ.500 కే డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను పొందవచ్చు అని, కేంద్ర ప్రభుత్వం మీకు రూ.500 కే గ్యాస్ సిలిండర్ను అందజేస్తుందని సమాచారం.కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఫేజ్ 3 కింద పేద కుటుంబాల మహిళా సాధికారత లక్ష్యంగా,  ఉచిత ఎల్పిజి పంపిణీ చేయబడింది. అయితే ఈ పథకం కింద మూడవ స్థాయి ఎల్పిజి కనెక్షన్ పొందిన వినియోగదారులకు రెండు బర్నర్ స్టవ్వు,  14.2 కిలోల సిలిండర్ మరియు రెండు ఐదు కిలోల సిలిండర్,  ఒక రెగ్యులేటర్,  ఒక సేఫ్టీ హోస్, డిజీసీసీ పుస్తకాలను పూర్తిగా ఉచితంగా ఇవ్వబడతాయి.  ఇప్పటివరకు ఎల్పీజీ గ్యాస్ కలెక్షన్లు లేని కుటుంబంలోని మహిళలు అవసరమైన పత్రాలతో మీకు దగ్గరలో ఉన్న ఎల్పీజీ గ్యాస్ పంపిణీ సంస్థను సందర్శించే సౌకర్యం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: