ఓరి నాయనో.. కిలో నెయ్యి రూ. 2లక్షలు.. ప్రత్యేకత ఏంటంటే?
ఇక ఇప్పుడు ఇలాంటి వార్త ఒకటి సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోయింది. ఇటీవల కాలంలో చాలామంది నెయ్యి వాడటం చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ప్రస్తుతం షాపులలో దొరికే నెయ్యి అయితే కాస్త కల్తీ ఉంటుంది అన్న విషయం అందరికీ తెలుసు. అందుకే పాల వ్యాపారుల దగ్గర ఎలాంటి కల్తీ లేకుండా తయారు చేసే నెయ్యిని కొనుగోలు చేయడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కాస్త డబ్బులు ఎక్కువైనా సరే పెద్దగా పట్టించుకోరు. అయితే కిలో నెయ్యి ఎంత ఉంటుంది అంటే.. వేలల్లోనే ఉంటుందని అందరూ అంటారు. కానీ కిలో నెయ్యి ఏకంగా రెండు లక్షల రూపాయలు ఉంటుంది అంటే నమ్ముతారా.
కిలో నెయ్యి రెండు లక్షలు ఏంటి బ్రో అంత ఉంటే ఎవరైనా కొంటారా అంటారు ఎవరైనా కానీ గుజరాత్ లో ఒక వ్యక్తి అమ్మే నెయ్యి కిలో ఏకంగా రెండు లక్షల దాకా ఉంటుంది వినడానికి నమసక్యంగా లేకపోయినా ఇది నిజమే. గొండాల్లో రమేష్ బాయ్ రూపరేలియా అనే రైతు ఆవుపాలతో నెయ్యిని చేసి.. దాని నుంచి రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తూ ఉంటాడు ఈ నెయ్యిలో కుంకుమ పువ్వు, పసుపు, పిప్పళ్ళు, గులాబీ రేకులు, మందారాలు ఇలా రకరకాల మూలికలను కలుపుతాడు. కిలో నెయ్యికి దాదాపు 31 లీటర్ల పాలు కావాలి. ఇందులో ఉండే ఔషధ గుణాల వల్ల ఇక ఈ నెయ్యికి అంత రేటు ఉంది అని చెప్పాలి.