MONEY: ఎల్ఐసి పాలసీ లాప్స్ అయితే ఇలా చేయండి..!!
సాధారణంగా బీమా కంపెనీలు సైతం ఎక్కువగా రెండు సంవత్సరాలు మాత్రమే ఈ అవకాశం ఉండేలా చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో పాలసీదారులు తమ ల్యాప్స్ అయిన పాలసీని పునరుద్ధరణ చేసుకోవచ్చు.. నిర్ణీత రోజులలో ప్రీమియం చెల్లించకపోతే బీమా పాలసీ గడువు ముగుస్తుంది.. బీమా పాలసీ అన్ని ప్రీమియం చెల్లిస్తున్నప్పుడు ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా ల్యాప్స్ అయితే పాలసీని మళ్ళీ యాక్టివేట్ చేసుకుని అవకాశం ఉంటుంది.. అయితే ఈ ఎల్ఐసి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రద్దు చేసిన పాలసీని తిరిగి చేయడాన్ని లేదా తిరస్కరించే అధికారాన్ని సైతం నిర్వహిస్తుంది.
పాలసీదారులు తమ ప్రీమియంను చెల్లించడానికి 15 నుంచి 30 రోజుల వరకు గ్రేస్ పీడియారని ఇస్తుంది. ఈ సమయంలో కూడా చెల్లించ లేకపోతే విఫలమవుతుంది
అయితే పాలసీదారుడు ఆలస్యమైన అసలు వడ్డీని నేరుగా బీమా కంపెనీకి చెల్లించడం ద్వారా మళ్లీ పునరుద్ధరణ చేసుకోవచ్చు.
పాలసీదారుల ఏజెంట్ కు కాల్ చేయడం లేదా బ్రాంచ్ ను సందర్శించడం ద్వారా ఎల్ఐసి బీమాను సైతం మళ్లీ పునరుద్ధరణ చేసుకోవచ్చు. అయితే ఇది రెండు లేదా ఏడాది లోపు మాత్రమే చేసుకుని అవకాశం ఉంటుంది.
పాలసీని రివైజ్ చేయడానికి పలు రకాల పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా వైద్య నివేదికల ఖర్చును సైతం చూపించాల్సి ఉంటుంది.
ఇలాంటి బీమా పథకాలను సైతం ఎట్టి పరిస్థితిలోనూ నిర్లక్ష్యం చేయకూడదు.