Money: ఉద్యోగులకు గుడ్ న్యూస్ దీపావళి కానుకగా డబ్బు జమ..!!

Divya
దీపావళి వేల ఉద్యోగులకు EPFO గుడ్ న్యూస్ తెలియజేస్తోంది .2022-23 ఆర్థిక ఏడాదికి సంబంధించి వడ్డీని పిఎఫ్ అకౌంట్ లో జమ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో చెక్ చేసుకోవచ్చు. సాధారణంగా ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈపీఎఫ్ అకౌంట్ ఉంటుంది. దీని కింద ప్రతినెల జీవితంలో 12% వరకు పిఎఫ్ ఖాతాలోకి వెళుతూ ఉంటుంది.. మనం పనిచేస్తున్న సమస్త యాజమాన్యం కూడా అంతే మొత్తంలో PF తమ్ముని అకౌంట్లో జమ చేస్తూ ఉండడం జరుగుతుంది.ఇలా జమ చేసిన డబ్బులను EPFO ప్రత్యేక వడ్డీ చెల్లిస్తూ ఉంటుంది.


2022-23 ఆర్థిక ఏడాదికి సంబంధించి వడ్డీని ఇప్పుడు జమ చేసినట్లు తెలుస్తోంది.. వడ్డీ రేటు ను 8.15 శాతం కేంద్రం నిర్ణయించినట్లుగా తెలియజేసింది. EPF ఖాతా ఉన్నవారికి ఈ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు అదే విధంగా అధికారికంగా పోర్టల్ తో పాటు టెస్ట్ మెసేజ్ ద్వారా మిస్డ్ కాల్ అలర్ట్ ద్వారా ఈజీగా వీటిని తెలుసుకోవచ్చు. అలాగే లాగిన్ పేజీలో UAN పాస్వర్డ్ లాగిన్ వల్ల కూడా EPF బ్యాలెన్స్ ను తెలుసుకోవచ్చు.


ఉమాంగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ ను ఓపెన్ చేసి ఇందులో ఈపీఎఫ్ సెక్షన్ లోకి వెళ్లి వ్యూ పాస్ బుక్ ఆప్షన్ ని ఎంచుకోవాలి.. ఆ తర్వాత UAN నెంబర్ ని ఎంటర్ చేసి ఓటిపి ఆప్షన్ ని ఎంచుకోవాలి. అలా మొబైల్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి  బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి.



7738299899 అనే నెంబర్ కు మెసేజ్ పంపడం ద్వారా కూడా EPF బ్యాలెన్స్ అయితే మనం తెలుసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ మొబైల్ నుంచి..EPFOHO అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి UAN నెంబర్ ని ఎంటర్ చేసి ఇంగ్లీష్ తెలుగు హిందీ వంటి లాంగ్వేజ్లలో ఎంటర్ చేసి అయినా పంపిస్తే బ్యాలెన్స్ మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: