మనీ: రూ.417 లతో 2.27 కోట్ల రాబడి..!!
ఈ పథకం వల్ల రోజుకి రూ.417 రూపాయలు పెట్టుబడి పెడితే ఏకంగా రూ.2.27 కోట్ల రూపాయల రాబడి వస్తుందట.. మైనర్ లేదా మానసిక స్థితి బాగాలేని వ్యక్తుల తరఫున ఇందులో పెట్టుబడి పెట్టేవారు కచ్చితంగా సంరక్షకులుగా రూ.500 నుంచి వార్షికంగా రూ.1.5 లక్షల రూపాయల వరకు పిపిఎఫ్ ఖాతాను ప్రారంభించవచ్చట. ప్రతిరోజు 417 రూపాయలు అంటే నెలకు 12,500.. ఏడాదికి 1.50 లక్షలు పెట్టుబడి పెడితే చాలు మెచ్యూరిటీ సమయానికి దాదాపుగా 2.27 కోట్ల రూపాయలను సైతం పొందవచ్చట.
PPF ఖాతాలు 15 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి తో వస్తాయని తెలుపు తున్నారు. అయితే మరి ఐదేళ్ల వరకు కొనసాగించు కోవచ్చు. మొత్తంగా 20 ఏళ్ల కు మించి కొనసాగడానికి చాలా ప్రాసెస్ ఉంటుందట. ప్రస్తుతం ఉన్న పీపీఎఫ్ వడ్డీ రేటు 7.10 శాతంగా ఉన్నది. దీని వల్ల మనకి పెట్టుబడి పెట్టిన తర్వాత మెచ్యూరిటీ వచ్చే సమయానికి 2.27 కోట్ల రూపాయల మొత్తాన్ని సైతం పొందవచ్చు. అయితే ఇలాంటి వాటిని పూర్తిగా తెలుసుకోవడానికి దగ్గరలో ఉండే బ్యాంకు లేదా మరి ఇతరత్రా వాటిని సంప్రదించాల్సి ఉంటుంది. రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు కూడా ఇది చాలా బెనిఫిట్స్ సైతం అందిస్తుంది.