మనీ: గ్యాస్ సబ్సిడీ అందాలంటే ఇలా చేయండి..!!

Divya
మరి కొద్ది రోజులలో డిసెంబర్ నెల పూర్తిగా ముగియబోతోంది.కేవలం మరి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నది.అయితే ప్రతి నెల ఒకటో తారీకు నుంచి పలు రకాల నిబంధనలు సైతం మారుతూ ఉంటాయి.. అయితే వీటిని ముందస్తుగా గమనించి అందుకు తగ్గ పనులు చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు..లేకపోతే ఆర్థికమైన నష్టంతో పాటు చాలా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.. కొత్త ఏడాది నుంచి LPG సిలిండర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు మార్గాలను జారీ చేసింది.


ముఖ్యంగా LPG సిలిండర్ కలిగిన వారందరూ కూడా ఈ నెలలోపు బయోమెట్రిక్ ఉన్న సైతం అప్డేట్ చేయాలట. గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ పొందేందుకు బయోమెట్రిక్ ను అప్డేట్ చేయాలని ఈ నెల ఆఖరి లోపల అది కూడా అప్డేట్ చేయకపోతే సబ్సిడీ ఆగిపోతుందని తెలియజేస్తోంది. ఈనెల 31వ తేదీ లోపు ఈ అప్డేట్ చేయాలని దీంతో చాలా మంది కస్టమర్లకు ఈ సమాచారం తెలియక ఈ అప్డేట్లను సైతం చేసుకోలేకపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో గ్యాస్ ఏజెన్సీ డీలర్లలో చాలా ఆందోళన నెలకొంటోంది.


బయోమెట్రిక్ అప్డేట్ చేసేందుకు సైతం ప్రజలు గ్యాస్ షాపులకు వెళ్లి అక్కడ బయోమెట్రిక్ అప్డేట్ చేయాలని తెలియజేస్తున్నారు. గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి మొబైల్ లో ప్రత్యేకమైన యాప్ ఉంటుందని అక్కడ కస్టమర్ల యొక్క వేలి ముద్ర లేకపోతే ముఖం స్కానింగ్ వంటివి చేస్తారట.. చాలా చోట్ల డెలివరీ బాయ్ లే మొబైల్ లో బయోమెట్రిక్ సైతం అప్డేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మీరు ఇంటివద్దే కాకుండా గ్యాస్ కార్యాలయానికి వెళ్లి కూడా ఈ కేవైసీని సైతం అప్డేట్ చేసుకోవచ్చు. లేకపోతే సబ్సిడీ కింద పడే డబ్బులు రావని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఎవరైనా ఈ విషయం తెలియకపోతే వెళ్లి గ్యాస్ ఏజెన్సీ దగ్గర బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: