మనీ: పెట్టుబడి పెడితే కొద్దిరోజుల్లోనే డబుల్ ఆదాయం..!!

Divya
సంపాదించే వాటిలో ఎంతో కొంత పొదుపు చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు.. ముఖ్యంగా ఆదాయాన్ని బట్టి సేవింగ్ విషయంలో పలు నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో ప్రజలను అవగాహన కూడా ఎక్కువగా పెరిగిపోతున్న నేపథ్యంలో పలు రకాల పథకాలలో ఇన్వెస్ట్మెంట్ చేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉన్నది.. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ రంగ స్థలాలలో ఒకటైన పోస్ట్ ఆఫీస్ కూడా పలు రకాల సేవింగ్స్ స్కీంలను కూడా ప్రజల కోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలా పోస్ట్ ఆఫీస్ తీసుకువచ్చిన బెస్ట్ స్కీమ్స్ గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం..


పోస్ట్ ఆఫీస్ తీసుకువచ్చిన స్కీములలో కిసాన్ వికాస్ పథకం కూడా ఒకటి.. ఈ పథకంలో పెట్టుబడులు పెట్టడం వల్ల సెక్యూరిటీతోపాటు మంచి రిటర్న్స్ కూడా అందుకోవచ్చట. ఈ పథకం వల్ల ప్రభుత్వం ఏకంగా 7.5 శాతం వడ్డీని సైతం అందిస్తారట దీంతో వెయ్యితో ఈ పథకాన్ని మొదలు పెడితే ఈ స్కీములో ఎలాంటి గరిష్ట పరిమితి అనేది అసలు ఉండదట. జాయింట్ ఖాతా కూడా అకౌంట్ ని ఓపెన్ చేసుకొని ఇందులో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. పదేళ్ల పైబడిన ఎవరైనా సరే ఈ పథకంలో అర్హులే..


ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఆదాయాన్ని సైతం మనం రెట్టింపు చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు 9 ఏళ్ల 7 నెలలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందట.. మొత్తం మీద 115 నెలలపాటు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5 లక్షల రూపాయలు పెడితే 10 లక్షలు పొందవచ్చు.. కిసాన్ పాత్ర యోజన ఖాతాను సైతం దగ్గరలో ఉండే పోస్ట్ ఆఫీస్ లో సైతం ఓపెన్ చేసుకోవచ్చు.. ఇందుకోసం అప్లికేషన్ను కూడా ఫార్మ్ చేయవలసి ఉంటుంది. మొత్తం నగదును లేదా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది ఈ పథకంలో వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: