మనీ: ఏడాదికి రూ.330 తో రూ.2 లక్షలు బెనిఫిట్..!!

Divya
కేంద్ర ప్రభుత్వం లోని మోడీ సర్కార్ పలు రకాల పథకాలను అమలు చేస్తూ వస్తోంది.ఈ పథకాలతో రైతులు, మహిళలు ,సీనియర్ సిటిజన్స్ కూడా బాగానే లాభాలు పొందుతున్నారు. ముఖ్యంగా ఇన్సూరెన్స్ పథకాలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పథకాలలో PMJJBY పథకం కూడా ఉన్నది. ఈ స్కీమ్ కింద దాదాపుగా 2 లక్షల వరకు ప్రయోజనాన్ని సైతం పొందవచ్చు. వీటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.

ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన పథకం అనేది ఇన్సూరెన్స్ స్కీమ్.. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ కింద వస్తుందట.. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ లో చేరిన వారికి నామమాత్రము కింద 2 లక్షల వరకు జీవిత బీమా ని కవరేజ్ చేసుకొనే సదుపాయం అందిస్తోంది. పాలసీదారుడు మరణిస్తే వారి కుటుంబానికి 2 లక్షల రూపాయల కింద అందిస్తారట.. ఈ పథకంలో చేరాలి అంటే ఏడాదికి 330 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.. ఇందులో ఇన్సూరెన్స్ ప్రీమియం..289 రూపాయలు కాగా ఏజెంట్ కమిషన్ 30 రూపాయలు ఇతర చార్జీలు 11 రూపాయలు ఉన్నాయి.

బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు ఆటోమేటిక్గా ఆటో డెబిట్ సదుపాయం కూడా కలదు.దీని ద్వారా మీ ఖాత నుంచి ప్రతి ఏడాది 330 రూపాయలు డెబిట్ అవుతుంది.. ఈ పథకంలో చేరాలి అంటే నేరుగా బ్యాంకు బ్రాంచ్ ను సైతం సంప్రదిస్తే సరిపోతుంది జూన్ 1 నుంచి ఈ పాలసీ అమలులో ఉన్నది. ఈ పథకంలో చేరాలి అంటే 8 నుంచి 50 ఏళ్ల వయసు కలిగిన వారు ప్రతి ఒక్కరు అర్హులే అలాగే బ్యాంకు ఖాతా కచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలి. ఇలా ప్రతి ఏడాది 330 రూపాయలు చెల్లిస్తే.. పాలసీదారుడు మరణిస్తే ఈ డబ్బుని కుటుంబ సభ్యులకు అందిస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: