మనీ: రియల్ ఎస్టేట్ తో లాభాలపంట..!!
రియల్ ఎస్టేట్ లావాదేవీలలో ఆస్తి పన్నులు చట్టపరమైన విధానాలను కచ్చితంగా అనుసరించాలి.ఈ నేపథ్యంలోనే రియల్ ఎస్టేట్ ను తమ కెరియర్గా ఉపయోగించుకోవాలి అనేవారికి కొన్ని సూచనలు సైతం తెలుసుకోవాల్సి ఉంటుంది. లొకేషన్ ని బట్టి రియల్ ఎస్టేట్లో లాభాలు ఉంటాయి.. రాబోయే రోజులలో ల్యాండ్ రేటు ఎక్కువగా పెరిగే చోట వీటిని తీసుకోవడం మంచిది.. నగరాలకు దగ్గరగా ఉండే వాటిని తీసుకోవడం వల్ల గణనీయమైన లాభాలను సైతం పొందవచ్చు.
ఉదాహరణకు ఏదైనా ప్రాపర్టీని మనం ఈరోజు 50 లక్షలకు కొనుగోలు చేస్తే 10 ఏళ్ల తర్వాత దాని విలువ కోటి రూపాయలకు పెరిగితే అప్పుడు రెండింతలు ప్రాపర్టీ మనకు దక్కిందని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా పెట్టిన పెట్టుబడి వడ్డీ వాటి ఖర్చులను సైతం పరిగణంలోకి తీసుకోవాలి.
ఏదైనా ప్రాపర్టీని డీల్ చేసేటప్పుడు కచ్చితంగా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యము.. ఇందుకు సంబంధించిన చట్టపరమైన లావాదేవీలను నిర్వహించాలి.. ఆస్తి డాక్యుమెంట్స్ ను పన్ను రియల్ ఎస్టేట్ లావాదేవులకు సంబంధించిన వాటిని గుర్తించుకోవాలి.
ఏ రియల్ ఎస్టేట్లో నైనా పెట్టుబడి సంపద సృష్టికి మూలకారకంగా ఉంటుంది. మార్కెట్ కి అనుగుణంగా వెళుతూ ఉంటే స్పష్టమైన లాభాలను సైతం పొందవచ్చు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించిన తర్వాతే నిర్ణయాలను తీసుకోవాలి.