మనీ: రూ.7లతో ప్రతినెల రూ .5 వెలు పింఛన్ ..!!

Divya
సంపాదించిన మొత్తం ఆదా చేయడం అనేది చాలా కష్టమైన పని అని చెప్పవచ్చు.. కానీ కొంత మొత్తాన్ని ఆదా చేసుకోవడం వల్ల.. వృద్ధాప్య వయసులో మనం ఎవరి మీద ఆధారపడకుండా ఉండవచ్చు.. వీటికి పెన్షన్ పథకాలు అద్భుతమైనవిగా ఈ మధ్యకాలంలో జోడించారు.. పొదుపు చేయడం వల్ల మీరు 60 ఏళ్ల తర్వాత ఎవరి మీద ఆధారకుండా ప్రతి నెల పింఛన్ ని తీసుకోవచ్చు. దీంతో జీవితాన్ని చాలా హాయిగా గడుపుకోవచ్చు.. అలాంటి పథకమే అటల్ పెన్షన్ యోజన పథకం..

దీంతో 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల కొంత మొత్తం పెట్టుబడి పెడితే 60 సంవత్సరాల తర్వాత ప్రతి నెల కూడా రూ .5000 రూపాయల వరకు పెన్షన్ తీసుకోవచ్చు.. మీరు 18 సంవత్సరాల వయసులో ఈ పథకంలో చేరినట్టు అయితే కేవలం రోజుకి రూ .7 రూపాయలు చెల్లిస్తే నెలకు రూ .210 అవుతుంది.. మీకు 60 ఏళ్లు వచ్చేవరకు సైతం ఈ ప్రీమియాన్ని చెల్లిస్తూ ఉండాలి.. అయితే వయసుతో పాటు ప్రీమియం కూడా పెరుగుతూ ఉంటుంది.
అందుకు  సంబంధించి పూర్తి సమాచారం కావాలి అంటే ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజనలో చేరవచ్చు.. ఇలా పథకంలో చేరడం వల్ల ఏడాదికి రూ .60 వేల రూపాయల వరకు పెన్షన్ అందుకునే అవకాశం ఉంటుంది.. మరి ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి దగ్గరలోని ఏదైనా కేంద్రం వద్దకు వెళ్లి అక్కడ వారు అడిగిన పత్రాలను సమర్పించి ఈ పథకంలోకి చేరడం మంచిది.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో డబ్బు ప్రతి ఒక్కరికి చాలా అవసరమే.. ముఖ్యంగా వృద్ధాప్య విషయంలో చాలామంది డబ్బు లేక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి పథకాలలో చేరితే మంచి లాభాలను కూడా అర్జించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: