రూపే కార్డు- వీసా కార్డులలో ఏది బెస్ట్.. వీటి మధ్య తేడా ఏమిటంటే..?

Divya
మనం ఎలాంటి లావాదేవీలు చేయాలన్న కచ్చితంగా మనం ఏటీఎం కార్డు వంటివి కచ్చితంగా వాడుతూ ఉంటాము. అయితే ఇందులో రూపే కార్డు, వీసా కార్డు అనేవి ఉంటాయి.అయితే వీటి మధ్య తేడా ఏంటి అనే విషయం కూడా చాలామందికి తెలియకపోవచ్చు. దీంతో కార్డును ఎంపిక చేసుకొనే విషయంలో కూడా చాలామంది ఎది చేసుకోవాలో తెలియకనే చేసుకుంటూ ఉంటారు. అందుకే ఈ రెండు కార్డుల మధ్య గల వ్యత్యాసాన్ని సైతం ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకొని ఏది ఉత్తమమో చూద్దాం.

రూపే కార్డు ఇండియాలో విస్తృతంగా ఆమోదం పొందినటువంటి కార్డు..దీనిని మనం అంతర్జాతీయ వెబ్సైట్లో వీటి సహాయంతో ఎలాంటి చెల్లింపులు చేయలేమట.. వీసా కార్డు అనేది కూడా దేశీయంగా అంతర్జాతీయంగా ఆమోదం పొందినటువంటి కార్డు ప్రపంచంలో దాదాపుగా ప్రతి దేశంలో అందరూ వీసా కార్డు సహాయంతోనే చెల్లింపులను చేస్తున్నారట. వీసా కార్డు నెట్వర్క్ లతో పోలిస్తే రూపే కార్డు చెల్లింపులకు చాలా తక్కువ ఛార్జీలు వసూలు చేస్తారట. ఈ కార్డు ద్వారా జరిగేటువంటి ప్రతి లావాదేవీ కూడా ఇండియన్ ప్రాసెస్ కింద అవుతుంది.

వీసా కార్డు అనేది అంతర్జాతీయ చెల్లింపు నెట్వర్క్ కిందికి మారుతుందట. ఇది లావాదేవీ కూడా దేశం వెలుపల జరిగే ప్రక్రియగా ఉంటుందట. దీంతో రూపే కార్డుతో పోలిస్తే అత్యధికంగా వీసా కార్డుకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందట. రూపే కార్డు లావాదేవులు వీసా కార్డుతో పాటుగా ఇతర కార్డులకు చెల్లింపు తో పోలిస్తే చాలా వేగంగానే ఉంటుంది. వీసా కార్డు తో పాటు ఇతర లావాదేవీలు చాలా తక్కువగానే ఉంటుందట. రూపే కార్డు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. రూపే కార్డు వీసా కార్డులలో ఏ కార్డు మంచిదనే విషయానికి వస్తే.. అవసరాలపైన ఆధారపడి ఇది ఉంటుందట ఎవరైనా దేశంలోని లావాదేవీలకు జరుపుతున్నట్లయితే రూపే కార్డు చాలా ఉత్తమం. అంతర్జాతీయ లావాదేవులు చేసే వారికి వీసా కార్డు ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: